Home » కుబేరుడికి తిరుమల శ్రీనివాసుడు రాసిచ్చిన పత్రం ఎక్కడ ఉందో మీకు తెలుసా ?

కుబేరుడికి తిరుమల శ్రీనివాసుడు రాసిచ్చిన పత్రం ఎక్కడ ఉందో మీకు తెలుసా ?

by Anji
Ad

సాధారణంగా ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అనే సామెతను మనం తరచూ వింటుంటాం. ఈ సామెత కేవలం మనుషులకు మాత్రమే కాదు.. దేవుడికి కూడా తప్పలేదు. తిరుమల కలియుగ ప్రత్యక్ష దైవం అయిన వేంకటేశ్వరస్వామికి కూడా ఈ అప్పు తిప్పలు తప్పలేదు. ఒక వైపు అతిథి మర్యాదలు, మరొక వైపు పెళ్లివాళ్ల గొంతెమ్మ కొరికలు వాటికి అయ్యే ఖర్చులు.. ఎక్కడికక్కడ చిట్టాపద్దులు తేలక ఏం చేయాలో తెలియక తలపట్టుకునే పరిస్థితి నెలకొంది. ఇతిహాసాల్లో పెళ్లి చేసుకోవడానికి అప్పు చేసిన మగ పెళ్లి వారు కూడా ఉన్నారు. ఆయన రాసిచ్చిన ఇత్తడి ప్రమాణం అది సత్యం అనేందుకు ఆధారంగా ఇప్పటికీ ఉంది. అది ఎక్కడ ఉందో ఓ లుక్కేద్దాం. 

Advertisement

శ్రీనివాసుడు అప్పు చేయడానికి కూడా ఓ కారణం ఉందండోయ్..  ముఖ్యంగా ఆడ పెళ్లి వారు ఆగర్భ శ్రీమంతులు. ఆకాశరాజుతో వియ్యమంటే మాటలు కాదు. కానీ డబ్బు దగ్గరకి వచ్చే సరికి రాజు కాదు..  ఎక్కడైనా రాజే..  రూపాయి దగ్గర కాదు అన్నది అమ్మవారి మాట. అందులో పెళ్లి కోసం దేవాది దేవుడు, ఆదిదేవుడు, బ్రహ్మదేవుడు, వారి భార్యలు పరివారజనాలు, రుషులు ఇలా అందరూ శ్రీనివాసుడిని కళ్యాణమూర్తిగా చూడాలని తిరుమల కొండకు విచ్చేశారు. పెళ్లికి వచ్చే వారికి భోజనాలు పెట్టాలి. కాసులు ఏర్పాటు చేయాలి. ఏం చేయాలి అని మదనపడుతున్న శ్రీనివాసుడిని పక్కకి పిలిచి ఆదివరహస్వామి క్షేత్రంలో రావిచెట్టు దగ్గరికి తీసుకెళ్లాడు శివయ్య. అప్పుడు పరమశివుడు మన దగ్గర డబ్బులు లేకపోయినా పరవాలేదు. కానీ నాకు బాగా డబ్బు కల స్నేహితుడు ఉన్నాడు అప్పు చేయవయ్యా అని ఆ పరమ శివుడే సలహా ఇచ్చాడట. 

Manam News

Advertisement

ఆయనతో సలహాతో శ్రీనివాసుడు రాహ స్వామి క్షేత్రంలో రావిచెట్టు కింద నిలుచుని కుబేరుడిని చాలా రహస్యంగా డబ్బు కావాలని అడిగాడట. ఏం అనుకోకండి. ఓ కాగితం రాసివ్వండి అని కుబేరుడే అడిగాడట. దీంతో నూటికి పది చొప్పున వడ్డి కడుతాను. మీ అప్పు కూడా తీర్చుతాను. అందులో బ్రహ్మంగారు, రావిచెట్టు సాక్షిగా సంతాలు చేసిన ఆ ప్రత్రం ఇప్పుడు ఆదివరాహస్వామి పీఠం కింద ఉండిపోయింది. ఈ మధ్య ఆ పత్రంను మ్యూజియంలో ఉంచారట. స్థల పురాణం ప్రకారం.. శ్రీనివాసుడు పద్మావతితో పెళ్లి ఖర్చులకు కుబేరుడు నుంచి 1కోటి14లక్షల బంగారు నాణాలను అప్పుగా పొంది.. దేవ శిల్పి విశ్వకర్మను శేషాద్రి కొండలపై స్వర్గాన్ని సృష్టించమని కోరాతాడు. అప్పు తన భక్తులు సమర్పించే వాటితో చెల్లించుతానని చెబుతాడు.

 

  కలియుగ ప్రత్యక్ష దైవంగా వేంకటేశ్వరస్వామిని కొలుస్తారు భక్తులు. దేవుడిని దర్శనం కోసం.. ఏడు కొండలకు నిత్యం భక్త కోటి తరలిస్తారు. మంచుకొండల్లోనూ గోవింద నామస్మరణాలు మారుమ్రోగనున్నాయి. తిరుమల శ్రీనివాసుడి హుండి నిత్యం కానుకలతో కళకళలాడుతుంది. శ్రీమంతుల నుంచి సామాన్యుడి వరకు తమ స్థాయిని బట్టి రకరకాల కానుకలను శ్రీవారికి భక్తులు సమర్పిస్తారు. ఈ హుండీనే కొప్పెర అని కూడా పిలుస్తారు. శ్రీనివాసుడికి ఆయన మామగారు ఆకాశరాజు నుంచి వచ్చిన కానుకల నుంచి నేటి భక్తులు సమర్పించే కానుకల వరకు అన్నీ హుండీలోనే సమర్పిస్తారు. 17వ శతాబ్దం ముందు నుంచే శ్రీవేంకటేశ్వరుడి దర్శనానికి వచ్చిన భక్తులు కానుకలు సమర్పించినట్టు శ్రీవారి ఆలయ చరిత్ర  చెబుతుంది. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

 Chanakya Niti : ఇలాంటి లక్షణాలు ఉన్నవారిని ఇంటి దరిదాపులకు కూడా రానివ్వకండి..!

ఉదయం పూట బ్రేక్‌ఫాస్ట్‌ చాలా ముఖ్యం.. లేదంటే ఆ సమస్యలు తలెత్తడం పక్కా..!

Visitors Are Also Reading