మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన సాయి ధరమ్ తేజ్. తన నటన, డ్యాన్సులతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. తక్కువ కాలంలోనే అభిమానుల్లో మంచి ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. వరుస సినిమాలు చేస్తున్న క్రమంలో ఓ యాక్సిడెంట్ అతని జీవితాన్ని మార్చేసింది. ఆ ప్రమాదం తరువాత సాయితేజ్ చాలా కాలం పాటు సినిమాలకు దూరంగా ఉండాల్సి వచ్చింది. ఆ తరువాత బ్రో సినిమా చేసినప్పటికీ అది అంత పెద్దగా హిట్ కాలేదు. ఆ తరువాత వచ్చిన విరూపాక్ష మాత్రం సూపర్ హిట్ ని సొంతం చేసుకుంది.
Advertisement
Advertisement
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకోని సాయి తేజ్ , స్వాతి నటించిన సత్య అనే షార్ట్ ఫిలింను మళ్లీ ప్రసారం చేశారు. ఈ తరుణంలోనే విలేకర్ల సమావేశంలో సాయి తేజ్ ను కొన్ని ప్రశ్నలు అడిగారు. అందులో సాయి జీవితంలో ముఖ్య పాత్ర పోషించిన మహిళల గురించి వివరించమంటే సాయి తేజ్ తన అమ్మ, పిన్ని, అమ్మమ్మ లేకపోతే ఈరోజు నేను ఈ స్థాయిలో ఉండేవాడిని కాదు అంటూ చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా సాయి తేజ్ మరో విషయాన్ని కూడా ప్రకటించాడు. అది ఏంటంటే..ఇక నుంచి తన పేరులో తల్లి పేరును చేర్చుకుని సాయి దుర్గ తేజ్ గా మారబోతున్నట్లు వివరించాడు. తన తండ్రి పేరు ఎలాగూ ఇంటి పేరుతో కలిసి వస్తుందని, తల్లి పేరును మాత్రం ఎందుకు దూరం చేసుకోవాలని సాయి తేజ్ అన్నాడు. ఇక నుంచి తన పేరు సాయి దుర్గ తేజ్ గా మారిందని చెప్పుకొచ్చాడు.
Also Read : ‘కల్కి’ లో ప్రభాస్ పేరు ఏంటో తెలుసా ?