Home » ‘కల్కి’ లో ప్రభాస్ పేరు ఏంటో తెలుసా ?

‘కల్కి’ లో ప్రభాస్ పేరు ఏంటో తెలుసా ?

by Anji
Published: Last Updated on
Ad

నాగ్ అశ్విన్ – ప్రభాస్ కాంబినేషన్ లో రానున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’.  ఈ  చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇవాళ మహాశివరాత్రి సందర్భంగా స్పెషల్ పోస్టర్ తొ శుభాకాంక్షలు చెప్పిన టీమ్ తాజాగా ఈ సినిమాలో ప్రభాస్ పేరును తెలుపుతూ పోస్ట్ పెట్టింది. ఇందులో ఆయన పేరు ‘భైరవ’ అని ప్రకటించింది. ఈ సినిమా నుంచి వరుస అప్ డేట్స్ వస్తుండడంతో ప్రభాస్ అభిమానులు తెగ సంబురపడుతున్నారు.


ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ ఇటలీలో జరుగుతోంది. ప్రభాస్, దిశా పటానీలపై పాటను తెరకెక్కిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఓ ఫొటోను నిర్మాణ సంస్థ  విడుదల చేసింది. స్టైలిష్ గాగుల్స్, స్లీవ్ లెస్ డ్రెస్, జిమ్ బాడీ పై పెద్ద పెద్ద టాటూస్, ట్రెండీ హెయిర్ స్టైల్ తో నెక్స్ట్ లెవెల్ లో ఉన్నారు. ఇక సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న డార్లింగ్ ఫ్యాన్స్ పోస్టర్ చూసి ఫుల్ ఖుష్ అవుతున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement

Advertisement

 ఈ సినిమా  గురించి తాజాగా దర్శకుడు మాట్లాడుతూ.. “మహాభారతంతో మొదలై.. క్రీస్తుశకం 2898లో పూర్తయ్యే కథ ఇది. మొత్తం 6 వేల ఏళ్ల వ్యవధిలో ఈ కథ విస్తరించి ఉంటుంది. గతం, భవిష్యత్తుతో ముడిపడిన కథ కాబట్టి అందుకు తగ్గట్టుగా ఆయా ప్రపంచాన్ని సృష్టించడానికి ప్రయత్నించాం. ఆ ప్రపంచాలు కూడా భారతీయతని ప్రతిబింబించేలా ఊహించుకుంటూ మలిచాం. హాలీవుడ్లో విడుదలైన సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘బ్లేడ్ రన్నర్’ పోలికలు ఇందులో కనిపించనీయలేదు. అది మాకు పెద్ద సవాల్ గా మారింది” అని చెప్పారు.

Also Read :  BHIMAA MOVIE REVIEW : భీమా మూవీ రివ్యూ.. గోపిచంద్ ఖాతాలో మరో హిట్ పడ్డట్టేనా ?

Visitors Are Also Reading