Home » మరో మెగా హీరోతో కలిసి సినిమా చేయనున్న ఎన్టీఆర్…!

మరో మెగా హీరోతో కలిసి సినిమా చేయనున్న ఎన్టీఆర్…!

by Azhar

టాలీవుడ్ లో ఇప్పుడు మల్టీ స్టారర్ సినిమాలు అనేవి ఎక్కువగా వస్తున్న విషయం తెలిసిందే. మాములుగా ఇలా వస్తున్న సినిమాల్లో ఎక్కువగా ఒక్క సీనియర్ హీరోతో పాటుగా ఈ తరానికి చెందిన ఓ యంగ్ హీరో కనిపిస్తున్నాడు. అలా కాకుండా ఒక్కే తరానికి చెందిన ఇద్దరు హీరోలు కలిసి చేస్తే వచ్చే ఆ మజా వేరే లెవల్ లో ఉంటుంది. అయితే మన టాలీవుడ్ లో కొన్ని ఫ్యామీలకు ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. అలాంటి రెండు ఫ్యామీలకు చెందిన హీరోలు కలిసి చేస్తే అభిమానులకు పండగే. అయితే ఈ మధ్యే నందమూరి హీరో ఎన్టీఆర్ అలాగే మెగా ఫ్యామిలీ హీరో రామ్ చరణ్ కలిసి ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది.

అయితే ఈ ఆర్ఆర్ఆర్ సినిమా ఫీవర్ అనేది ఇంకా జనాల్లోనుండి వెళ్లిపోలేదు. అంతలోనే ఇప్పుడు మరో వార్త అనేది సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. అదేంటంటే… ఆర్ఆర్ఆర్ లో మెగా హీరో రామ్ చరణ్ తో కలిసి నటించిన ఎన్టీఆర్ ఇప్పుడు మరో మెగా హీరోతో కలిసి నటించనున్నాడు అని తెలుస్తుంది. అయితే ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ ప్రస్తుతం రెండు సినిమాలు అనౌన్స్ చేసాడు. అందులో మొదటి సినిమా కొరటాల శివతో తియనున్నాడు. కానీ పలు కారణాల వల్ల ఈ సినిమా అనేది ఇంకా సెట్స్ పైకి వెళ్ళలేదు.

వచ్చే నెల చివరి వరకు ఈ సినిమా అనేది సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే ఈ సినిమాలోనే ఎన్టీఆర్ తో కలిసి మరి మెగా హీరో సాయి ధరమ్ తేజ్ స్క్రీన్ అనేది షేర్ చేసుకోనున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో ఓ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది అని తెలుస్తుంది. అందులో ఎన్టీఆర్ బామ్మర్దిగా సాయి ధరమ్ తేజ్ కనిపించబోతున్నాడు అని తెలుస్తుంది. ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ పాత్ర చిన్నగా ఉన్న కూడా.. అదే కథకు చాలా ముఖ్యం అని తెలుస్తుంది. అయితే ఇందులో ఎంత నిజం ఉంది అనేది తెలియదు. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే వార్త ట్రెండ్ అవుతుంది.

ఇవి కూడా చదవండి :

బీసీసీఐని ఒలంపిక్స్ విషయంలో ఆడుకుంటున్న ఫ్యాన్స్…!

నా లక్ష్యం అదే… క్లారిటీ ఇచ్చిన విరాట్ కోహ్లీ..!

Visitors Are Also Reading