Home » బీసీసీఐని ఒలంపిక్స్ విషయంలో ఆడుకుంటున్న ఫ్యాన్స్…!

బీసీసీఐని ఒలంపిక్స్ విషయంలో ఆడుకుంటున్న ఫ్యాన్స్…!

by Azhar
Ad
భారత క్రికెట్ కాంట్రొల్ బోర్డు అనేది ప్రపంచంలోనే అత్యంత ధనికమైన బోర్డుగా గుర్తింపు అనేది పొందింది. 2008 లో మన బీసీసీఐ ప్రారంభించిన ఐపీఎల్ అనేది బోర్డుకు ఊహించని రీతిలో ఆదాయం అనేది తెచ్చి పెట్టింది. అందువల్ల అంతర్జాతీయ క్రికెట్ మండలినే శాసించే స్థాయిలోకి వెళ్ళింది బీసీసీఐ. అయితే ఈ క్రమంలోనే మన బీసీసీఐ కానీ లేక ఐసీసీ కానీ క్రికెట్ ను ఎలాగైనా ఒలంపిక్స్ క్రీడలో చేర్చాలి అనే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆది కుదరట్లేదు. అయితే ఇప్పుడు ఈ ఒలంపిక్స్ విషయంఓ బీసీసీఐని తెగ ట్రోల్ అనేది చేస్తున్నారు ఫ్యాన్స్.
అయితే ఇలా బీసీసీఐని ఇప్పుడు ట్రోల్ చేసేది క్రికెట్ ఒలంపిక్స్ లో లేదు అన్ని కాదు. మన ఇండియన్ ఒలంపిక్ అథ్లెట్స్ విషయంలో బీసీసీఐ ఫాలో అవుతున్న పద్ధతిపై. అయితే తాజాగా జరిగిన బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో  గత ఒలంపిక్స్ పై 18 కోట్లను ఖర్చు చేసినట్లు బీసీసీఐ పేర్కొంది. కానీ ఇందులో కేవలం నాలుగు కోట్లు మాత్రమే మన ఒలంపిక్ అథ్లెట్స్ కు అందజేసింది బీసీసీఐ. అథ్లెట్స్ కు మద్దతుగా ఉండేందుకు బీసీసీఐ ఒలంపిక్స్ లో మెడల్స్ సాధించిన వారికి నగదు పురాస్కారం అనేది అందిస్తుంది.
కానీ గత ఒలంపిక్స్ పై బీసీసీఐ ఖర్చు చేశాను అని చెబుతున్న దన్తలో కేవలం 4 కోట్లు మాత్రమే అథ్లెట్స్ కు ఇచ్చింది. మిగిలిన 14 కోట్లను ఆడంబరాలకు వృధా చేసింది బీసీసీఐ. మొత్తం ఈ 14 కోట్లలో ఆటగాళ్ల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో  పడేందుకు ప్రముఖ సింగర్ మోహిత్  చౌహాన్ కు 70 లక్షలు ఇచ్చింది. అలాగే ఒలింపిక్స్ మార్కెటింగ్ క్యాంప్ కు 90 లక్షలు ఖర్చు చేసింది. ఇక టోక్యో ఒలింపిక్స్ ప్రమోషన్స్ కోసం 7 కోట్లు ఓ కమర్షియల్ కంపెనీకి ఇచ్చింది. అలాగే  5 కోట్లు పీఎం కేర్స్ మెమొంటోల కోసం ఖర్చు చేసినట్టు పేర్కొంది బీసీసీఐ. అయితే డబ్బుల విషయంలో బీసీసీఐ వ్యవరించిన ఈ తీరు అనేది విమర్శలకు ధరి తీసింది.

Advertisement

Visitors Are Also Reading