ఉక్రెయిన్, రష్యా మధ్య క్షణక్షణానికి పరిస్థితులు మారిపోతూ ఉన్నాయి. ఏ క్షణంలో ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితి. ఒక వేళ యుద్ధం సంభవిస్తుందేమోనని భయపడుతున్నారు. ఉక్రెయిన్ పై ముప్పేట దాడులు చేసేందుకు మూడు వైపుల నుంచి సైన్యం రెడిగా ఉంది. యుద్ధాన్ని నివారించేందుకు ప్రపంచ దేశాలు ప్రయత్నిస్తున్నాయి. తాము ఉక్రెయిన్‌పై దాడులు చేయబోమని రష్యా చెబుతున్నా పరిస్థితులు చూస్తుంటే ఏ క్షణంలో దాడులు జరుగుతాయో అని భయపడిపోతున్నారు. ఈ సమయంలో ఎలాంటి ఇబ్బందులు వస్తాయోనని ఆందోళన చెందుతున్నారు.
Advertisement
Advertisement
ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్‌పై రష్యా ప్లాన్ సీ అమలు చేయనునందనే వదంతులు వ్యాపిస్తున్నాయి. ప్లాన్ సీ అంటే అర్థం సైబర్ దాడులు, ఉక్రెయిన్‌పై సైబర్ దాడులు జరిగే అవకాశముందని జాగ్రత్తగా ఉండాలని నిపుణులు పేర్కొంటున్నారు. గతంలో అనేక మార్లు ఉక్రెయిన్‌పై రష్యా సైబర్ దాడులు చేసింది. ఇలాంటి విపత్కర సమయంలో దాడులు జరిగితే దాని వల్ల ఆ దేశం తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. అంతేకాదు ఈ దాడులు బ్యాంకిగ్ రంగాలపై కాకుండా రక్షణ రంగంపై కూడా జరిగే అవకాశమున్నట్టు అమెరికా వర్గాలు చెబుతున్నాయి. తాము ఎలాంటి దాడులు చేయడం లేదని రష్యా చెబుతున్నా ప్రపంచం మాటను పట్టించుకోవడం లేదంటున్నారు.
Also Read : స్కూటీలు, ల్యాప్‌టాప్స్‌పై ఆఫర్స్ ఎంత అని కాజేశాడో తెలుసా..?