Home » స్కూటీలు, ల్యాప్‌టాప్స్‌‌పై ఆఫర్స్ ఎంత‌ అని కాజేశాడో తెలుసా..?

స్కూటీలు, ల్యాప్‌టాప్స్‌‌పై ఆఫర్స్ ఎంత‌ అని కాజేశాడో తెలుసా..?

by Anji
Ad

ఖ‌మ్మం జిల్లాలో ఘ‌రానా మోసం వెలుగులోకి వ‌చ్చింది. ఓ స్వ‌చ్ఛంద సంస్థ పేరుతో రూ.65వేల‌కే స్కూటీ ఇస్తాన‌ని న‌మ్మ‌బ‌లికాడు. సుమారు రూ.కోటి యాబై ల‌క్ష‌ల వ‌ర‌కు వ‌సూలు చేశాడు. ఇంకెముందు వ‌సూలు చేసిన డ‌బ్బుతో ప‌రార‌య్యాడు. అస‌లు విష‌యం గ్ర‌హించిన బాధితులు ల‌బోదిబోమంటూ పోలీసుల‌ను ఆశ్ర‌యించారు. జిల్లాలోని మ‌ధిర చెరుకుమ‌ల్లి వారి వీధిలో ఇస్కాన్ స్వ‌చ్ఛంద సంస్థను రాధాకృష్ణ అనే వ్య‌క్తి నెల‌కొల్పాడు.

Advertisement

Advertisement

తొలుత 10 రోజుల్లోనే స్కూటీలు ఇచ్చేవాడు. చాలా మంది తెలిసిన వారితోను బంధువుల‌తో డ‌బ్బు క‌ట్టించారు. ల్యాప్‌టాప్‌లు, గ్రైండ‌ర్లు, కుట్టుమిష‌న్‌ల పేరుతో డ‌బ్బులు వ‌సూలు చేశాడు. సుమారు కోటి 50ల‌క్ష‌లు వసూలు చేసాడు. తెలంగాణ‌తో పాటు ఏపీలోని కృష్ణా, విశాఖ జిల్లాల నుంచి కూడా కేటుగాడికి డ‌బ్బు స‌మ‌ర్పించుకున్నారు. రాధాకృష్ణ ఫోన్ స్విచ్చాప్ పెట్టుకోవ‌డంతో అనుమానం వ‌చ్చిన బాధితులు అత‌ని ఇంటికి వెళ్లారు. ఎవ‌రు లేక‌పోవ‌డం మోస‌పోయామ‌ని గ్ర‌హించి బాధితుల‌కు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దాదాపు 150 మందికి పైగా బాధితులు డ‌బ్బులు ఇచ్చిన‌ట్టు తెలుస్తుంది.

Also Read :  సోషల్ మీడియాలో అసత్య ప్రచారంపై చర్యలు తీసుకోండి.. కాంగ్రెస్ నేత వీహెచ్ పోలీసులు ఫిర్యాదు..!

Visitors Are Also Reading