Home » Romancham OTT : తెలుగులో బంపర్ హిట్ ‘రోమాంచం’ హారర్ మూవీ.. ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే

Romancham OTT : తెలుగులో బంపర్ హిట్ ‘రోమాంచం’ హారర్ మూవీ.. ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే

by Bunty
Ad

ప్రస్తుతం సినిమాలు థియేటర్ లో విడుదలైన కొద్ది రోజులకే ఓటిటి లోకి వస్తున్నాయి. అయితే కొన్ని సినిమాలు థియేటర్ లో ఫ్లాప్ టాక్ ను సొంతం చేసుకున్నప్పటికీ ఓటిటిలో మాత్రం ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. అలా ఓటిటిలో మెప్పించిన‌ సినిమాలు చాలానే ఉన్నాయి. ఇక మలయాళం సినిమాల గురించి చెప్పేది ఏముంది.

read also : విడాకులపై సమంత సంచలన వ్యాఖ్యలు..”పుష్ప” ఐటెం సాంగ్ వద్దన్నారంటూ !

Advertisement

 

వారు ఎప్పుడూ మనసును తాకే సినిమాలతో మాయ చేస్తూనే ఉంటారు. ఆ కోవకే చెందిన సినిమా ‘రోమాంచం’. హారర్ కామెడీ జోనర్ లో ఈ చిత్రం తెరకెక్కింది. ఫిబ్రవరి 3న కేరళలో 144 స్క్రీన్లలో విడుదలైన ఈ చిత్రం 2023లో మలయాళ సినిమాల్లో మొదటి బాక్సాఫీస్ హిట్ గా నిలిచింది. కేవలం 2 కోట్ల బడ్జెట్ తో తిరిగిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 70 కోట్ల వరకు వసూలు చేసింది.

Advertisement

Romancham Movie OTT Release Date On Disney+Hotstar - Streaming Start From  7th April

అలాగని ఇందులో బడా నటులు ఎవరూ లేరు. మలయాళ సినిమాలు చూసే వారికి తెలిసిన సౌబిన్ షాహీర్ ఒక్కడే కనిపిస్తాడు. ఫన్ కోసం ఓయిజా గేమ్ ఆడే కొంతమంది ఫ్లాట్ మేట్స్ చుట్టూ కథను అల్లుకున్నాడు డైరెక్టర్ జిత్తూ మాధవన్. కాగా ఈ మూవీ ఓటిటి డేట్ ఫిక్స్ అయ్యింది. ఏప్రిల్ 7 నుంచి డిస్నీ+హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవ్వనుంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఇది అందుబాటులో ఉంటుంది.

read also : TS Constable : ఏప్రిల్‌ 2న పోలీస్‌ కానిస్టేబుల్‌ తుది రాతపరీక్ష..కచ్చితంగా ఈ రూల్స్ పాటించండి

Visitors Are Also Reading