Manam News : బ్రేకింగ్ న్యూస్ తెలుగు » Extra Jabardasth : రాఖేష్, సుజాత లవ్ స్టోరీ మామూలుగా లేదుగా..!

Extra Jabardasth : రాఖేష్, సుజాత లవ్ స్టోరీ మామూలుగా లేదుగా..!

by Anji
Ads

ఈటీవీలో ప్రతి శుక్రవారం బుల్లి తెర ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నటువంటి కామెడీ షో ఎక్స్ ట్రా జబర్దస్త్ . ఈ వారం కూడా ప్రేక్షకులకు మరింత వినోదాన్ని పంచేందుకు సిద్ధం అయింది. ముఖ్యంగా రాకింగ్ రాఖేష్-జోర్దార్ సుజాత కొద్ది రోజులుగా ప్రేమలో మునిగి తేలుతున్న విషయం తెలిసిందే. జబర్దస్త్ వేదికగా వీరి ప్రేమ చిగురించింది. తాజాగా విడుదలైన ఎక్స్ ట్రా జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమోతో వీరి లవ్ స్టోరీని రాకింగ్ రాఖేష్ కన్ఫామ్ చేసారు. 

Advertisement

Ad

జబర్దస్త్ నటుడు, రాకింగ్ రాఖేష్- బిగ్ బాస్ ఫేమ్ జోర్దార్ సుజాత కొద్ది రోజులుగా ప్రేమలో ఉన్నారని.. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని ప్రచారం జరుగుతోంది. అందుకు తగినట్టుగానే ఈ జంట సిగ్నల్స్ ఇస్తోంది. బిగ్ బాస్ సీజన్ 4తో అలరించిన సుజాత ఆ ఫేమ్ తోనే జబర్దస్త్ షో లో అవకాశాలను అందుకున్నది. ఈ నేపథ్యంలోనే రాకింగ్ స్టార్ రాఖేష్ తో స్నేహం కాస్త ప్రేమగా మారి పెళ్లి వైపు పయణిస్తోందని పేర్కొంటున్నారు.ఎప్పటి మాదిరిగానే ఆర్టిస్టుల స్కిట్లు, పంచ్ లు, పెర్పామెన్స్ తో జబర్దస్త్ వేదికపై పంచులు పేలుతున్నాయి. యాంకర్ రష్మి గౌతమ్ వ్యాఖ్యాతగా, జడ్జీలు ఖుష్బూ, క్రిష్ణభగవాన్ తమదైన రెస్పాండ్ తో ఆకట్టుకున్నారు. ప్రోమో చివరలో టీవీ ఆడియెన్స్ అందరినీ ఆశ్చర్యపరిచారు. 

Advertisement

Also Read :  ఏపీ పాలిటిక్స్ కి రిలేటెడ్ గా “వీరసింహారెడ్డి” బాలయ్య డైలాగ్స్ ! గోపీచంద్ మలినేని ఇచ్చిన రిప్లై అదుర్స్ !

రాఖేష్-సుజాత ప్రేమ ఉత్తుత్తిదే అనుకున్నప్పటికీ.. తాజాగా ఎక్స్ ట్రా జబర్దస్త్ వేదికపై వీరిద్దరి లవ్ స్టోరీ మరో కొత్త మలుపు తిరిగింది. త్వరలోనే ఈ జంట పెళ్లి చేసుకోబోతున్నట్టు తెలుస్తోంది. ప్రోమో ఆధారంగా.. సుజాత చేతి వేలికి రింగు తొడిగి రాఖేష్ ఆశ్చర్యపరిచారు. రాఖేష్ ఆమెను హత్తుకొని.. నుదిటిపై Muద్దు పెట్టి మరి తన లవ్ స్టోరీని కన్ ఫమ్ చేసేశారు. ఇటీవల వీరిద్దరూ తిరుమల, తిరుపతి దేవస్థానంలో కూడా కనిపించారు. వీరి పెళ్లిపై రాఖేష్ వాళ్ల అమ్మ పలు ఆసక్తికరమైన కామెంట్స్ కూడా చేిసంది. సుజాత తమ కుటుంబ సభ్యులతో కలిసి పోయిందని సంతోషం వ్యక్తం చేసిందట. సంక్రాంతి పండుగకి కూడా వాళ్ల అత్తగారింటికి వెళ్లినట్టు సమాచారం. ఏది ఏమైనప్పటికీ రాఖేష్ ఇచ్చిన ట్విస్ట్ తో త్వరలోనే వీరి ఎంగేజ్ మెంట్ జరగబోతుందనే సందేహం కలుగుతోంది. ముందు ముందు ఏం జరుగుతుందనేది వేచి చూడాలి మరి. 

Also Read :  సావిత్రి ఇంట్లో ఉన్న బీరువాల కొద్దీ బంగారం… కూతురు విజయచాముండేశ్వరి సంచలన వ్యాఖ్యలు

Visitors Are Also Reading