Home » ఏపీ పాలిటిక్స్ కి రిలేటెడ్ గా “వీరసింహారెడ్డి” బాలయ్య డైలాగ్స్ ! గోపీచంద్ మలినేని ఇచ్చిన రిప్లై అదుర్స్ !

ఏపీ పాలిటిక్స్ కి రిలేటెడ్ గా “వీరసింహారెడ్డి” బాలయ్య డైలాగ్స్ ! గోపీచంద్ మలినేని ఇచ్చిన రిప్లై అదుర్స్ !

by Anji
Ad

నందమూరి నటసింహం, గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ హీరోగా.. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం వీరసింహారెడ్డి. ఈ చిత్రం పాజిటివ్ టాక్ తోనే దూసుకెళ్తోంది. తాజాగా దర్శకుడు గోపిచంద్ మలినేని ఓ ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా ఈ సినిమాకి బాలకృష్ణ ఎంతో నమ్మకం పెట్టుకొని సినిమా చేశారు. ఆ నమ్మకానికి తగ్గట్టుగానే చిత్రాన్ని తెరకెక్కించి బాలయ్య ఖాతాలో ఓ విజయాన్ని అందించినట్టు తెలిపారు. బాలకృష్ణ డైలాగ్స్ ప్రెజెంటేషన్స్ గురించి అందరూ చాలా బాగా మెచ్చుకున్నారని దర్శకుడు వెల్లడించారు. 

Advertisement

కాస్ట్యూమ్ డిజైన్ చాలా బాగుందని.. ఇప్పటివరకు ఏ సినిమాలో చూపించని విధంగా బాలయ్యని కొత్తగా చూపించడానికి కారణం ఎవ్వరు అని యాంకర్ ప్రశ్నించగా..   చాలా స్కెచ్ స్ వేయించిన తరువాత తనకు నచ్చిన తరువాత బాలయ్య బాబుకి చూపించగానే చాలా బాగుందని ఓకే చెప్పారు. వైట్ అండ్ వైట్ చేయాలని ఉంది.. మరోవైపు మనస్సులో బ్లాక్ షర్టు ఉంది. ఇది అడగాలా వద్దా అని అనుకున్నాను. బాలయ్య గారే బ్లాక్ షర్టుతో చేద్దామన్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ తోనే పాజిటివ్ టాక్ రావడంతో.. అందుకే సినిమా మొత్తం బాలయ్య బ్లాక్ షర్టులోనే కనిపించారు.బాలయ్య బాబుతో సినిమా చేయడం మమొరబుల్ ఎక్స్ పీరియన్స్. ఒక అభిమానిగా ఎక్కడ ఫ్యాన్ మూవ్ మెంట్ ఇవ్వాలి.. కథనంలో ఎక్కడ ఆడియన్స్ ని ఎంగేజ్ చేయాలి అని ఈ రెండింటి మీదనే వర్క్ చేశాను అని తెలిపారు గోపిచంద్. ముఖ్యంగా ఇంతకు ముందు బాలయ్య చేసిన సినిమాల్లో ప్లాష్ బ్యాక్ ఇంటర్ వెల్ తరువాత ఎంట్రీ అయ్యారు. కానీ ఈ సినిమాలో ఇంట్రవెల్ కే బాలయ్య క్యారెక్టర్ చనిపోతుంది.  అభిమానులు రిసీవ్ చేసుకుంటారోనని.. చాలా రిస్క్ తో కూడుకున్నది ఇది. కానీ అభిమానులు పాజిటివ్ గా రిసీవ్ చేసుకున్నారు. 

Advertisement

Manam News

Veerasimhareddy

Also Read :  బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ చిత్రానికి అన్యాయం చేశారా..?

వీరసింహారెడ్డి షూటింగ్ హైదరాబాద్, అనంతపురం, కర్నూలు, సిరిసిల్ల ప్రాంతాల్లో షూటింగ్ చేసినట్టు వెల్లడించారు. తెలుగు సినిమా ప్రేక్షకులు సినిమాలను ఎంతగా ఆదరిస్తారో వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలే నిదర్శనం. తెలుగు ప్రేక్షకులు సంక్రాంతి పండుగకు వచ్చిన ఈ రెండు సినిమాలను విజయంతం చేశారని పేర్కొన్నారు. వీరసింహారెడ్డి డైలాగ్స్ గురించి యాంకర్ ప్రశ్నించగా.. బాలకృష్ణ సినిమా అంటేనే అభిమానులు పవర్ పుల్ డైలాగ్స్ ని ఎక్స్ పెక్ట్ చేస్తుంటారు. వీరసింహారెడ్డి సినిమాలో కేవలం కథను మాత్రమే ఫాలో అయ్యాం తప్పా.. వేరే విధంగా పెట్టాలనే ఆలోచన లేదు.. ఈ డైలాగ్స్ గురించి రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. అవన్ని ఎవరికీ వారు ఊహించుకుంటే మేము ఏం చేయలేము. కథ పరంగానే వచ్చిన డైలాగ్ లు తప్ప ఎవ్వరినీ ఉద్దేశించి ఈ సినిమాలో పెట్టలేదని దర్శకుడు గోపి చంద్ మలినేని ఓ క్లారిటీ ఇచ్చారు. 

Also Read :  ‘దృశ్యం’ సినిమాలో వెంకటేష్ పెద్ద పాపగా నటించిన ఈ హీరోయిన్ ఎవరో తెలుసా?

Visitors Are Also Reading