Home » సిరాజ్ వల్లనే గొడవ అంటున్న రియాన్ పరాగ్…!

సిరాజ్ వల్లనే గొడవ అంటున్న రియాన్ పరాగ్…!

by Azhar
Published: Last Updated on
Ad

ఐపీఎల్ 2022 సీజన్ ముగిసింది. కొత్తగా వచ్చిన గుజరాత్ టైటాన్స్ జట్టు విజేతగా నిలిచింది. ఇక ప్రతి ఐపీఎల్ సీజన్ మాదిరిగానే ఈ ఐపీఎల్ లో కూడా కొందరు యువ ఆటగాళ్లు బయటికి వచ్చారు. అదే విధంగా కొన్ని గొడవలు కూడా బయటికి వచ్చాయి. అందులో చాలా మంది అభిమానులు నోట్ చేసింది మాత్రం. రియాన్ పరాగ్ – హర్షల్ పటేల్ గొడవ. అయితే ఈ గొడవ జరగడానికి ముఖ్య కారణం మరో ఆటగాడు సిరాజ్ అని అంటున్నాడు పరాగ్.

Advertisement

అయితే తాజాగా ఐపీఎల్ సీజన్ ముగిసిన తర్వాత పాల్గొన ఓ ఇంటర్వ్యూ లో పరాగ్ మాట్లాడుతూ… నాకు , హర్షల్ కు గొడవ జరగానికి ముఖ్య కారణం సిరాజ్. అసలు అక్కడ ఏం జరిగిందో చెప్పడానికి ముందు గత ఐపీఎల్ లో ఏం జరిగిందో చెప్పాలి. ఐపీఎల్ 2021 లో మాకు రాజస్థాన్ అలాగే బెంగళూర్ జట్టుకు మధ్య మ్యాచ్ జరిగినప్పుడు నేను హర్షల్ బౌలింగ్ లోనే ఔట్ అయ్యాను. అప్పుడు నేను సైలెంట్ గా వెళ్ళాను. కానీ హర్షల్ మాత్రం నన్ను వెళ్ళిపో వెళ్ళిపో అంటూ సైగ చేసాడు. అది నేను గ్రౌండ్ లో చూడలేదు. బయటికి వచ్చిన తర్వాత రిప్లై లో చూసాను. అది నాకు బాగా గుర్తుండిపోయింది.

Advertisement

ఇక ఈ ఐపీఎల్ లో మళ్ళీ మా రెండు జట్లకు మ్యాచ్ జరిగినప్పుడు నేను హర్షల్ బౌలింగ్ లో బాగా ఆడాను. ఈ మ్యాచ్ చివరి ఓవర్ లో 18 రన్స్ కొట్టాను. దాంతో గత ఐపీఎల్ ఘటన నాకు గుర్తుకు వచ్చి.. అప్పుడు అతను ఎలా చేసాడో ఇప్పుడు నేను కూడా అలానే వెళ్ళిపో… వెళ్ళిపో అన్నట్లు సైగ చేశాను. కానీ సిరాజ్ వచ్చి.. నువ్వు పిల్లాడివి.. నువ్వు అలా చేయకూడదు అంటూ నాకు చెప్తూ హర్షల్ ను రెచ్చగొట్టాడు. అందువల్ల వాగ్వాదం జరిగింది. కానీ తర్వాత మా జట్టు సబ్భ్యులు ఒక్కరు వచ్చి నన్ను తీసుకెళ్లారు. ఇక మ్యాచ్ ముగిసిన తర్వాత నేను అంత మరిచిపోయి అతనికి హ్యాండ్ షేక్ ఇస్తే తీసుకోలేదు. సరే అతను ఇమ్మెచ్యూర్ అని నేను అనుకుంటూ వెళ్ళిపోయా అని రియాన్ పేర్కొన్నాడు.

ఇవి కూడా చదవండి :

దీపక్ చాహర్ పెళ్ళిలో ఆ క్రికెటర్ ను చూసి ఫైర్ అవుతున్న ఫ్యాన్స్..!

పాకిస్థాన్ ఆటగాళ్ల పై ఉమ్రాన్ మాలిక్ షాకింగ్ కామెంట్స్… పొరపాటున కూడా..!

Visitors Are Also Reading