Home » పవన్ పై రివేంజ్.. పెద్ద ప్లాన్ చేసిన ఏపీ సర్కార్..తగ్గేదేలే అంటున్న ఫ్యాన్స్..!!

పవన్ పై రివేంజ్.. పెద్ద ప్లాన్ చేసిన ఏపీ సర్కార్..తగ్గేదేలే అంటున్న ఫ్యాన్స్..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

ప్రస్తుతం పవన్ క్రియాశీలక రాజకీయాల్లో పూర్తిస్థాయిలో కొనసాగుతున్నారు. టైం దొరికినప్పుడల్లా సినిమా షూటింగ్లలో పాల్గొంటూ ముందుకు వెళ్తున్నారు. కానీ ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ కు మరియు ఏపీ సర్కారుకు మధ్య పెద్ద రచ్చే జరుగుతుంది. ఈ రచ్చ పవన్ వకీల్ సాబ్ సినిమాతో మొదలై భీమ్లా నాయక్ వరకు కూడా వచ్చింది. ఇక భీమ్లా నాయక్ సినిమా రిలీజ్ అయిన రోజు థియేటర్ల దగ్గర ప్రభుత్వ అధికారులు బెటాలియన్ ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ హీరోగా చేసిన మరో చిత్రం బ్రో.

Advertisement

డైరెక్టర్ సముద్ర కని తెరకేక్కించిన ఈ మూవీ జూలైలో రిలీజ్ కు సిద్ధంగా ఉంది. దీనిపై పవన్ ఫ్యాన్స్ కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ తరుణంలో జగన్ సర్కార్ పవన్ కళ్యాణ్ సినిమాపై టార్గెట్ చేసిందని పవన్ ఫ్యాన్స్ అంటున్నారు. అయితే పవన్ ఏ కొత్త సినిమా రిలీజ్ కాబోతున్న ఏదో ఒక కొత్త డెసిషన్ తో జగన్ సర్కార్ ముందుకు వస్తోంది. ఈ తరుణంలో కేవలం 99 రూపాయలకే కొత్త సినిమాని కూడా ఇంట్లో ఉండి విడుదలైన మొదటి రోజు చూడవచ్చని దానికోసం సర్కార్ ప్లాన్ తీసుకువస్తోందని టాక్ వినిపిస్తోంది. దీంతో పవన్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

పవన్ సినిమాలు ఇతర ఈవెంట్లు ఉన్న సమయంలోనే ప్రభుత్వం ఇలాంటి టాక్ విడుదల చేస్తుందంటుదన్నారు. అదే గతంలో కూడా పవన్ బర్త్ డే సందర్భంగా పూర్తిగా బ్యానర్లు బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ రూల్ కూడా ఆయన సినిమా రిలీజ్ కి ముందు తీసుకువచ్చి సినిమా అయిపోయాక మళ్ళీ తీసేస్తారు అంటూ పవన్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఎవరు ఆపిన పవన్ ఆగే హీరో కాదంటూ గట్టిగా మాట్లాడుతున్నారు ఫ్యాన్స్.

మరికొన్ని ముఖ్య వార్తలు:

Visitors Are Also Reading