Home » టీవీ స్క్రీన్ నలుపు రంగులోనే ఎందుకు ఉంటదో తెలుసా ?

టీవీ స్క్రీన్ నలుపు రంగులోనే ఎందుకు ఉంటదో తెలుసా ?

by Anji
Ad

సాధారణంగా మనం ఉదయం నిద్రలేవగానే టీవీ ఆన్ చేస్తుంటాం. టీవీలలో లేడీస్ సీరియల్స్, పిల్లలు బొమ్మలు, ఇంటి యజమాని ఐపీఎల్ మ్యాచ్, క్రికెట్ మ్యాచ్ లు చూడాలని ఆసక్తి చూపిస్తుంటారు. ఇలా కుటుంబ సభ్యుల మధ్య తరచూ టీవీ దగ్గర గొడవలు జరుగుతుంటాయి. ఉదయం నిద్రలేచినప్పటి నుంచి రాత్రి నిద్రించే వరకు జరిగే తంతూ ఇది. అసలు ఇప్పుడు టీవీ విషయం గురించి ఎందుకు మాట్లాడుతున్నారు రా అనుకుంటున్నారా?  టీవీ చూస్తున్నప్పుడు ఈ విషయం మాత్రం ఎవ్వరూ గమనించరు. టీవీ స్క్రీన్ నల్లగా ఉండటం.. అసలు ఈ డౌట్ ఇప్పుడు ఎందుకు వచ్చిందని అనుకుంటున్నారా ? టీవీ స్క్రీన్ నల్లగానే ఎందుకు ఉంటుంది. వేరే రంగుల్లో ఎందుకు ఉండదు అని మీకు అనిపించిందా ? ఆన్ చేసినప్పుడు, ఆప్ చేసినప్పుడు నల్లగానేే ఎందుకు మారిపోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Advertisement

వాస్తవానికి టీవీ నలుపు రంగులోకి మారిపోవడానికి కారణం ఏంటంటే.. స్క్రీన్ ఆఫ్ చేసినప్పుడు సాధారణంగా నలుపు రంగులో కనిపిస్తుంది. ఎందుకు అంటే డిస్ ప్లే బ్యాక్ లైట్ ఆఫ్ అయిపోతుంది. కాబట్టి కొన్ని టీవీల స్క్రీన్ లు ఆఫ్ చేసినప్పుడు.. బ్లూ లేదా ఎరుపు రంగులో కనిపిస్తాయి. దీనికి కారణం టీవీలోని సెట్టింగ్స్. టీవీ స్క్రీన్ నల్లగా కాకుండా మరో కలర్ లోకి మార్చాలంటే మన చేతుల్లో పనే. సెట్టింగ్ లోకి వెళ్లి కలర్ ని మార్చుకోవచ్చు. అన్నీ టీవీలకు ఈ ఫెసిలీటీ ఉండదండి. అలా చేసేటప్పుడు సెట్టింగ్స్ కి సంబంధించి యాప్ ను ఇన్ స్టాల్ చేసుకోవాలి. యాప్ సపోర్ట్ చేయాలి.

Advertisement

టీవీ స్క్రీన్ నల్లగా ఉండడానికి కారణం ఏమిటీ అనే ప్రశ్నకు తమదైన శైలిలో సమాధానాలు ఇస్తున్నారు కొందరూ వినియోగదారులు. టీవీ ఆఫ్ చేసినప్పుడు స్క్రీన్ లైట్ ఆఫ్ అయిపోతుందని. . ఈ సమయంలో పిక్సెల్ నుంచి కాంతి విడుదల చేసే CRT, OLED, ప్లాస్మా స్క్రీన్ లు పూర్తిగా స్లీప్ మోడ్ లోకి వెళ్లిపోతాయని చెబుతున్నారు. అందుకే అవి నల్లగా మారిపోతాయంటున్నారు. సాధారణంగా టీవీ స్క్రీన్ లపై ఉండే అద్దం నల్లగా ఉండటం వల్ల టీవీ ఆఫ్ అయిపోయినప్పుడు స్క్రీన్ కూడా నల్లగా మారుతుందంటున్నారు. టీవీ స్క్రీన్ నల్లగా ఉండడం పై కారణాలను వెతుకుతున్నారు.

మరికొన్ని ముఖ్య వార్తలు : 

పెళ్లి పీటలెక్కిన ‘దసరా’ దర్శకుడు.. వధువు ఎవరంటే ?

దుబాయిలో రూ.100 కోట్లతో షారుఖ్ విల్లా… స్వర్గం కూడా పనికిరాదు !

Visitors Are Also Reading