Home » ఏపీ పాలిసెట్ నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. ముఖ్య‌మైన తేదీలు ఇవే..!

ఏపీ పాలిసెట్ నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. ముఖ్య‌మైన తేదీలు ఇవే..!

by Anji

Ap Polycet Notification 2022: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని ప్ర‌భుత్వ‌, ప్ర‌యివేటు పాలిటెక్నిక్ క‌ళాశాల‌లో 2022-23 విద్యా సంవ‌త్స‌రానికి వివిధ డిప్లోమా కోర్సుల్లో ప్ర‌వేశాల‌కు పాలిటెక్నిక్ కామ‌న్ ఎంట్రెన్స్ టెస్ట్ 2022 నోటిఫికేష‌న్‌ను ఏపీ సాంకేతిక విద్యా శిక్ష‌ణ మండ‌లి విడుద‌ల చేసింది.

ఆస‌క్తి కలిగిన విద్యార్థులు ఏప్రిల్ 11 నుంచి అధికారిక వెబ్‌సైట్ polycetap.nic.in ఆన్‌లైన్ మోడ్‌లో ధ‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చ‌ని ఏపీ సాంకేతిక విద్య క‌మిష‌న‌ర్ పోలా భాస్క‌ర్ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. టెన్త్ లేదా త‌త్స‌మాన ప‌రీక్ష‌లో ఉత్తీర్ణీత సాధించిన విద్యార్థులు ఎవ‌రైనా ద‌రఖాస్తు చేసుకోవ‌చ్చు. వీరితో పాటు ఏప్రిల్/ మే 2022 టెన్త్ ప‌రీక్ష‌ల‌కు హాజ‌రు కాబోయే విద్యార్థులు కూడా అర్హులే. రిజిస్ట్రేష‌న్ ఫీజు రూ.400లు విధిగా చెల్లించాలి.

Ap Polycet Notification 2022

ఏప్రిల్ 11 నుంచి మే 18 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ కొన‌సాగుతుంది. విద్యార్థులు చివ‌రి తేదీ వ‌ర‌కు వేచి ఉండ‌కుండా స‌కాలంలో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని సాంకేతిక విద్యామండ‌లి ఈ సంద‌ర్భంగా సూచించింది. ఇక పాలిటెక్నిక్ ప్ర‌వేశ‌ప‌రీక్ష మే 29న రాష్ట్రవ్యాప్తంగా ప‌లు ప‌రీక్ష కేంద్రాల‌లో జ‌ర‌గ‌నుంది.

Also Read :  ప‌దునైన చూపులు.. ఈటెతో ప‌వ‌ర్ స్టార్‌.. అదిరిన హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు..!

Visitors Are Also Reading