పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న మరో కొత్త సినిమా హరిహర వీరమల్లు. క్రిష్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. శ్రీరామనవమి సందర్భంగా ఇవాళ హరిహర వీరమల్లు కొత్త పోస్టర్ ను విడుదల చేశారు. విడుదల చేసిన ఈ పోస్టర్లో పవను పదునైన చూపులతో చేతులు ఈటెతో మరి ఇంత పవర్ఫుల్ గా కనిపిస్తున్నారు. విడుదలైన కొద్ది క్షణాల్లోనే సోషల్ మీడియాలో ఈ పోస్టర్ పవన్ కళ్యాణ్ అభిమానులు లైకులు కామెంట్లు లతో సోషల్ మీడియా ను షేక్ చేస్తున్నారు.
Advertisement
Advertisement
ప్రస్తుతం హైదరాబాధ్లో సినిమా షూటింగ్ జరుగుతోంది. ఇవాళ శ్రీ రామనవమి పండుగ సందర్భంగా షూటింగ్లో పూజ కూడా నిర్వహించారు. హరిహర వీరమల్లు సినిమాలో గోల్కొండ నవాబు, వజ్రాలు ఇదివరకు ఎన్నడూ చూడని ఎవరు టచ్ చేయని కొత్త కాన్సెప్ట్ తో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు.
Advertisement
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన టీజర్ పోస్టర్లు నెట్టింట్లో వైరల్ అయిన విషయం తెలిసిందే మరొకవైపు తోట తరణి కూడా ఈ సినిమాలో భాగమయ్యారు సినిమా కోసం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో సెట్స్ పై భారీ ఎత్తున వర్క్ జరుగుతోంది. మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ మీద అగ్ర నిర్మాతల్లో ఒకరైన ఏఎం రత్నం సమర్పణలో దయాకర్ రావు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.