టాలీవుడ్ లో టాప్ హీరోలలో మాస్ మహారాజ రవితేజ ఒక్కరు. ఈయనను చాలా మంది అభిమానిస్తారు. అయితే ప్రస్తుతం రవితేజ హిట్ లేక బాధపడుతున్నాడు అనే విషయం తెలిసిందే. ఈ మధ్యే కాలంలో ఆయన నటించిన అన్ని సినిమాలు ప్లాప్ అవుతున్నాయి. గత ఏడాది మొదట్లో క్రాక్ సినిమా హిట్ తర్వాత ఇప్పటివరకు ఒక్క హిట్ లేకపోయినా వరుస సినిమాలు అయితే చేస్తున్నాడు రవితేజ.
Advertisement
ప్రస్తుతం రవితేజ వరుస సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే రవితేజ నటిస్తున్న మూడు సినిమాలు సెట్స్ పైన ఉన్నాయి. ధమాకా, రావణాసుర, టైగర్ నాగేశ్వర్ రావు అనే సినిమాలు చేస్తున్నాడు రవితేజ. ఇవే కాకుండా మెగాస్టార్ చిరంజీవి 154వ సినిమాలో కూడా ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. అయితే ఇన్ని సినిమాలు ఇలా లైన్ లో ఉండగానే మరో సినిమాలు కూడా రవితేజ ఓకే చేసినట్లు సమాచారం. ఈ సినిమా షూటింగ్స్ మధ్య దొరికే గ్యాప్ లో రవితేజ కొత్త కథలను వింటున్నాడట.
Advertisement
అయితే అందులో నచ్చిన కథలను ఓకే చేస్తున్నట్లు తెలుస్తుంది. తాజాగా అలాగే సినిమాటోగ్రాఫర్ ఘట్టమనేని కార్తీక్ చెప్పిన ఓ కథ రవితేజకు బాగా నచ్చింది అని.. దాంతో ఈ సినిమాను చేయడానికి మాస్ మహారాజ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చాడు అని తెలుస్తుంది. కానీ ఈ సినిమాను ఎవరు నిర్మిస్తారు.. ఇందులో హీరోయిన్ గా ఎవరు కనిపిస్తారు అనేది తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి :