Home » విరాట్ భార్య ఐరన్ లేడీ..!

విరాట్ భార్య ఐరన్ లేడీ..!

by Azhar
Ad

ఇండియాలో విపరీతమైన క్రేజ్ ఉన్న జంటలలో విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ జంట అనేది ముందు వరుసలో ఉంటుంది. అందుకు కారణం ఆ ఇద్దరు కూడా సెలబ్రెటీలు కావడం. అయితే గత ఏడాది కాలంగా కోహ్లీ ఫామ్ లో లేక పరుగులు చేయలేకపోతుంటే.. అందుకు కారణం అనుష్కనే అంటూ కొందరు కామెంట్స్ కూడా చేసారు. కానీ ఆసియా కప్ లో ఆఫ్గనిస్తాన్ పైన తాజాగా కోహ్లీ సెంచరీ చేసాడు.

Advertisement

అయితే ఈ సెంచరీ తర్వాత విరాట్ మాట్లాడుతూ.. నాకు కష్ట సమయంలో తోడుగా ఉన్న నా భార్య అనుష్క శర్మకు అలాగే నా కూతురు వామికకు ఈ సెంచరీ అంకితం అంటూ పేర్కొన్నారు. అయితే కోహ్లీ కామెంట్స్ పై పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ స్పందిస్తూ.. కోహ్లీ భార్య అనుష్క శర్మ ఐరన్ లేడి అంటూ కితాబు ఇచ్చాడు. అలాగే ఆమెపై ప్రశంసలు కూడా కురిపించాడు.

Advertisement

అక్తర్ మాట్లాడుతూ.. సెంచరీ తర్వాత కోహ్లీ తన భార్య గురించి ఎక్కువగానే చెప్పాడు.కోహ్లీ యొక్క ఈ సక్సెస్ వెనుక ఉన్న అనుష్క శర్మకు నా హ్యాట్సాఫ్ అంటూ అక్తర్ పేర్కొన్నాడు. అలాగే కోహ్లీ ఉక్కు కండరాలతో తయారైన ఐరన్ మేన్ అని.. అనుష్క ఐరన్ లేడి అని కామెంట్స్ చేసాడు. ఇక కోహ్లీ ఎంతో మంచి మనిషి అని చెప్పిన అక్తర్.. అతను ఇలానే ఆడాలి అని కోరుకుంటున్నట్లు పేర్కొన్నాడు. అయితే ఈ ఆసియా కప్ లో సెంచరీతో పటు కోహ్లీ ఫామ్ కూడా వెన్నకి వచ్చిన విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి :

ప్రపంచ కప్ కూడా బుమ్రా లేనట్టేనా..?

నా కంటే కోహ్లీనే గొప్ప అని ఒప్పుకున్నా దాదా..!

Visitors Are Also Reading