Home » గాయ‌ప‌డ్డ ప్లేయ‌ర్లంద‌రూ ఐపీఎల్‌కు ఫిట్ కావ‌డానికి కార‌ణం ఏమిటి..?

గాయ‌ప‌డ్డ ప్లేయ‌ర్లంద‌రూ ఐపీఎల్‌కు ఫిట్ కావ‌డానికి కార‌ణం ఏమిటి..?

by Anji
Published: Last Updated on
Ad

ఐపీఎల్ ప్రపంచంలో గొప్ప ఫిజియోథెరపిస్ట్ గా పనిచస్తుందని మాజీ కోచ్ రవి శాస్త్రి పేర్కొన్నాడు. గాయపడ్డ ప్లేయర్లంద‌రూ ఐపీఎల్ వేలానికి ముందు ఫిట్ గా తయారవుతారని ఎద్దేవా చేశాడు. క్రికెట్ వర్గాల్లో చాలామంది ఇదే భావన లో ఉన్నారని సాధారణ వ్యక్తులు సైతం ఇదే అనుకుంటున్నారని చెప్పుకొచ్చాడు.

 

Advertisement

Advertisement

  • మరోవైపు ఐపీఎల్ లో అధిక ధరలు పలికిన యువకులకు కీలక సూచనలు చేశారు శాస్త్రి. డబ్బుల విషయాన్ని మర్చిపోయి గేమ్ బేసిక్స్ పై దృష్టి పెట్టాలన్నాడు. ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలించాలని సూచించాడు. యువకులపై ఒత్తిడి తగ్గించే బాధ్యత కెప్టెన్ లపై ఉంటుందని అన్నాడు.

 

  • భారత జాతీయ జట్టుకు తదుపరి కెప్టెన్ విషయంపై మాట్లాడిన శాస్త్రి ఈ ఐపీఎల్ లో ఆశావాహులు మెరుగైన ప్రదర్శన చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాడు తర్వాతి తరం కెప్టెన్‌ల‌ను అన్వేషించడం ఈ సీజన్ ప్రత్యేకత అని అభిప్రాయపడ్డాడు. ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ అ జట్టును అద్భుతంగా నడిపిస్తున్నాడని ప్రశంసించాడు కేఎల్ రాహుల్ శ్రేయస్ అయ్యర్ రిషబ్ పంత్ లకు భారత తదుపరి కెప్టెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపాడు.

 

  • ఐపీఎల్ వల్ల కొత్త ప్లేయర్లను కనిపెట్టడం సులభం అయిందని అన్నాడు శాస్త్రి. వెంకటేష్ అయ్యర్ గురించి అప్పటి వరకు ఎవరికీ తెలియదు. కానీ ఇప్పుడు జాతీయ జట్టుకు ఆడుతున్నాడు అదే ఐపీఎల్ ప్రత్యేకత. ఇక ఐపీఎల్ లో లో హర్ధిక్ పాండ్య ను దేశమంతా గమనిస్తూ ఉంటుంది అతడు బౌలింగ్ చేస్తాడా లేదా అనేది చూడాల్సి ఉందన్నాడు.

Also Read :  చినిగిపోయిన నోట్లను బ్యాంకు ఏమి చేస్తుందో తెలుసా..?

Visitors Are Also Reading