Home » చినిగిపోయిన నోట్లను బ్యాంకు ఏమి చేస్తుందో తెలుసా..?

చినిగిపోయిన నోట్లను బ్యాంకు ఏమి చేస్తుందో తెలుసా..?

by Anji
Ad

క‌రెన్సీ నోట్లు స్ట్రాంగ్‌గా ఉండ‌వు. అవి సుల‌భంగానే న‌లిగిపోతుంటాయి. టైమ్ బాగోలేక‌పోతే చినిగిపోతాయి కూడా. అయితే చినిగిపోయిన నోట్ల‌ను బాగా న‌లిగిపోయిన నోట్ల‌ను కొంత మంది షాపుల‌లో ఇస్తే తీసుకోరు. దీంతో ఆనోట్లు మ‌న వ‌ద్ద‌నే అలాగే ఉండిపోతాయి. రూ. 10, రూ.20 నోట్ల‌ను పెద్ద‌గా ప‌ట్టించుకోం. అధిక విలువ క‌లిగిన క‌రెన్సీ నోట్లు చినిగితే మాత్రం బాధ‌ప‌డ‌తాం. అయితే నోట్లు చినిగిపోతే బాధ ప‌డాల్సిన అవ‌స‌రం లేదు. చినిగిపోయిన నోట్ల స్థానంలో నూత‌న క‌రెన్సీ నోట్ల‌ను పొంద‌వ‌చ్చు.

Also Read :  చాణక్య నీతి : కుటుంబ పెద్ద చేయకూడని తప్పులు ఇవే…!

Advertisement

రిజ‌ర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా మార్గ‌ద‌ర్శ‌కాల ప్ర‌కారం.. బ్యాంకులు క‌స్ట‌మ‌ర్ల‌కు చినిగిపోయిన నోట్ల‌ను ఇచ్చి కొత్త నోట్ల‌ను తీసుకోవ‌చ్చు. అయితే ఇక్క‌డ ఓ కండీష‌న్ ఉంది. అది ఏమిటంటే చిరిగిపోయిన ఇవ్వ‌వ‌చ్చు కానీ అది దొంగ నోటు మాత్రం కాకూడ‌దు. బ్యాంకులు మీ చినిగిపోయిన నోట్ల‌కు బాగున్న వేరే నోట్ల‌ను అందిస్తాయి. అంతేకాదు మీరు ఏ బ్యాంకుకు వెళ్లైనా స‌రే పాత చినిగిపోయిన నోట్ల‌ను మార్చుకోవ‌చ్చు. ఇంకా బ్యాంకులు నోట్ల మార్పిడి ఎలాంటి డ‌బ్బులు తీసుకోవు. బ్యాంకు వాళ్లు తీసుకొని ఆర్‌బీఐ వాళ్ల‌కు అంద‌జేస్తారు.

Advertisement


చినిగిపోయిన నోట్ల‌కు ఉచితంగానే మీకు దాని స్థానంలో మ‌రొక నోట్లు ల‌భిస్తాయి. ఇక్క‌డ కొన్ని సంద‌ర్భాల్లో చినిగిపోయిన నోట్ల‌కు వేరే నోట్లు ఇవ్వ‌డానికి బ్యాంకులు నిరాక‌రించ‌వ‌చ్చు. ముఖ్యంగా క‌రెన్సీ నోట్లు కాలిపోయినా.. లేదా ముక్కలుగా చినిగిపోయినా బ్యాంకులు వేరే నోట్లు ఇవ్వ‌క‌పోవ‌చ్చు. ఇలాంటి సంద‌ర్భంలో మీరు ఇలాంటి నోట్ల‌ను ఆర్‌బీఐ ఆఫీస్‌కు వెళ్లి డిపాజిట్ చేయాలి. ఇంకెందుకు ఆల‌స్యం మీ వ‌ద్ద చినిగిపోయిన నోటు ఉంటే ద‌గ్గ‌ర‌లో ఉన్న‌టువంటి బ్యాంకుకు వెళ్లి మార్చుకోండి.

Also Read :  వావ్‌.. సూప‌ర్ స్టార్ సినిమా నెల రోజుల ముందే సెన్సార్ పూర్తి..!

Visitors Are Also Reading