Home » చిరంజీవి సినిమానే భయపెట్టిన రవితేజ మూవీ.. ఫస్ట్ మూవీతోనే ఆ డైరెక్టర్ రికార్డు..!

చిరంజీవి సినిమానే భయపెట్టిన రవితేజ మూవీ.. ఫస్ట్ మూవీతోనే ఆ డైరెక్టర్ రికార్డు..!

by Anji
Ad

సినీ ఇండస్ట్రీలో చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరూ సినిమాలు తీస్తుంటారు. ఒక్కోసారి చిన్న హీరోల సినిమా హిట్ అయితే.. మరోసారి పెద్ద హీరోల సినిమాలు సూపర్ హిట్ అవుతుంటాయి. ఇలాంటివి మనం ఇండస్ట్రీలో చాలా సందర్భాల్లో చూశాం. అలాగే అప్పట్లో  అప్పుడప్పుడే ఇండస్ట్రీలో మెల్లగా ఎదుగుతూ వస్తున్న మాస్ మహారాజా రవితేజ.. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన సినిమాకు పోటీగా నిలబడి చిరంజీవిని సైతం ఓడించడం అనే అరుదైన ఘటన చోటు చేసుకుంది. 

Advertisement

అసలు విషయానికొస్తే.. ప్రముఖ మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను ని ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ.. రవితేజ హీరోగా నటించిన సినిమా భద్ర. ఈ మూవీ అప్పట్లో ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. వాస్తవానికి ఈ సినిమాను అల్లు అర్జున్ చేయాల్సిందట. కానీ అప్పటికే ఆయన కాల్షీట్స్ వేరే సినిమాకి కమిట్ అయిపోవడంతో స్వయంగా ఆయనే బోయపాటి శ్రీనును తన కారులో ఎక్కించుకొని నిర్మాత దిల్ రాజుకు పరిచయం చేయించి.. ఈ మూవీని ఆయన బ్యానర్ లో రవితేజను హీరోగా పెట్టి తెరకెక్కించేవిధంగా ప్లాన్ చేశాడు అల్లు అర్జున్. ఈ సినిమా ఆ రోజుల్లోనే రూ.16కోట్లకు పైగా షేర్ వసూళ్లను సాధించింది.ఈ మూవీ విడుదలైన సరిగ్గా నెల రోజులకు చిరంజీవి నటించిన అందరివాడు సినిమా విడుదలైంది. 

Advertisement

ఇందులో చిరంజీవి డబుల్ రోల్ నటించాడు. ఈ సినిమా కి ఇంద్ర, ఠాగూర్, శంకర్ దాదా MBBS  వంటి సెన్షేషనల్ బ్లాక్ బస్టర్స్ హిట్స్ ఉన్నాయి. అలాంటి సమయంలో వచ్చిన అందరివాడు మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. అయితే కామెడీ పరంగా మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకున్నప్పటికీ.. చిరంజీవి రేంజ్ కి తగ్గ సినిమా కాదనిపించి ఈ మూవీ విజయం సాధించలేకపోయింది.  బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా యావరేజ్ టాక్ తో నడిచింది. మెగాస్టార్ స్టామినా వల్ల ఆ రోజుల్లో రూ.15కోట్ల వరకు షేర్ వసూలు చేసింది. అందరివాడు సినిమాకి నెగటివ్ టాక్ ఉండటం.. రవితేజ భద్ర మూవీకి పాజిటివ్ టాక్ ఉండటంతో భద్ర సినిమా 100 రోజులు ఆడగా.. అందరివాడు మాత్రం కేవలం 50 రోజులతోనే సరిపెట్టుకుంది. అప్పట్లో ఈ సినిమా ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ కాలేదు.. కానీ ఇప్పుడు టీవీలో ప్రసారమైనప్పుడు ఈ చిత్రాన్ని తెగ ఎంజాయ్ చేస్తున్నారనే చెప్పవచ్చు. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

వీళ్లు టాప్ విలన్స్ అయితే వీరి భార్యలు టాప్ హీరోయిన్స్ అనే విషయం మీకు తెలుసా ? 

 ప్రభాస్ ‘ప్రాజెక్ట్ K’ టీజర్ లాంఛ్ చేసేది ఎక్కడో తెలుసా ?

Visitors Are Also Reading