Home » ప్రభాస్ ‘ప్రాజెక్ట్ K’ టీజర్ లాంఛ్ చేసేది ఎక్కడో తెలుసా ?

ప్రభాస్ ‘ప్రాజెక్ట్ K’ టీజర్ లాంఛ్ చేసేది ఎక్కడో తెలుసా ?

by Anji

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో చాలా బిజీగా ఉన్నాడు. ఇటీవలే ఆదిపురుష్ సినిమా విడుదలైన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకి  మిశ్రమ స్పందన లభిస్తోంది. మరోవైపు కలెక్షన్లు తొలి మూడు రోజులు భారీగానే వచ్చినప్పటికీ నాలుగో రోజు నుంచి తగ్గుతూ వచ్చాయి. ఇదిలా ఉంటే.. ప్రభాస్ ప్రస్తుతం సలార్, ‘ప్రాజెక్ట్ K’ వంటి క్రేజీ సినిమాల్లో నటిస్తున్నారు. 

సలార్ మూవీకి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. జులై మొదటి వారంలో సలార్ ట్రైలర్ విడుదల కానున్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే.. మహానటి ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ జోనర్ లో తెరకెక్కుతోంది ప్రాజెక్ట్ K. ఈ మూవీ టీజర్ ని కూడా జులైలో గ్రాండ్ గా విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారని ఓ వార్త వైరల్ అవుతోంది. తాజాగా టీజర్ లాంఛ్ ఎక్కడ ఉండబోతుందనే దానిపై ఆసక్తికర అప్డేట్ నెట్టింట వైరల్ అవుతోంది. ప్రాజెక్ట్ K టీజర్ ని యూఎస్ఏలో గ్రాండ్ గా లాంఛ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నట్టు సమాచారం. 

ఈ మూవీ నుంచి విడుదల చేసిన దీపికా పడుకునే లుక్ తో పాటు ప్రభాస్ హ్యాండ్ లుక్ సినిమా హాలీవుడ్ స్థాయికి ఏమాత్రం తగ్గకుండా ఉండబోతున్నట్టు తెలుస్తోంది. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికాపడుకునే, దిశా పటానీ, ఫీ మేల్ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. మేకర్స్ ప్రాజెక్ట్ K లో కీలకం కాబోయే రైడర్స్ కాస్ట్యూమ్స్ మేకింగ్, అసెంబ్లింగ్ వీడియోను విడుదల చేయగా.. సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. దర్శకుడు నాగ్ అశ్విన్ టీమ్ ప్లాన్ ప్రకారం.. అక్టోబర్ వరకు వీఎఫ్ఎక్స్, రీ రికార్డింగ్, డిజిటల్ ఇంటర్మీడియట్ పనులను పూర్తి చేయనున్నారని టాక్ వినిపిస్తోంది. జనవరి 12, 2024న ప్రాజెక్ట్ K ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్టు ఇది వరకే ప్రకటించారు. ఈ మూవీ ఎలా ఉండబోతుందో తెలియాలంటే సంక్రాంతి వరకు వేచి చూడాల్సిందే. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

“ఛత్రపతి” కంటే ముందే ప్రభాస్, రాజమౌళి కాంబినేషన్ లో మిస్ అయిన ఈ సినిమా ఏదో తెలుసా?

 Pawan Kalyan: పవన్ కళ్యాణ్, ఆర్జీవీ కాంబో లో సినిమా మిస్ అయ్యిందా? ఆ సినిమా ఏంటంటే?

Bhagavanth Kesari: బాలయ్య “భగవంత్ కేసరి” నుంచి కొత్త లీక్.. వైరల్ అవుతున్న ఫోటో!

Visitors Are Also Reading