Home » వీళ్లు టాప్ విలన్స్ అయితే వీరి భార్యలు టాప్ హీరోయిన్స్ అనే విషయం మీకు తెలుసా ? 

వీళ్లు టాప్ విలన్స్ అయితే వీరి భార్యలు టాప్ హీరోయిన్స్ అనే విషయం మీకు తెలుసా ? 

by Anji

సాధారణంగా సినిమాల్లో హీరోకి సమానమైన పాత్ర ఏదైనా ఉందంటే అది విలన్ పాత్ర అనే చెప్పాలి. సినిమాలో విలన్ పాత్ర ఎంత బలంగా ఉంటే హీరో అంత హైలెట్ అవుతాడు. అందుకే దర్శక ధీరుడు రాజమౌళి ప్రతీ సినిమాలో కూడా విలన్ ని చాలా పవర్ ఫుల్ గా చూపిస్తాడు. టాలీవుడ్ విలన్స్ యాక్టింగ్ లో ఏమాత్రం తీసిపోరు. సినిమాల్లో పగ, ద్వేషం, చంపడం వంటి వాటితో క్రూరంగా ఉండే విలన్ల భార్యలు ఎలా ఉంటారో అనే సందేహం దాదాపు అందరికీ వస్తుంటుంది. కానీ ఇక్కడ మన విలన్స్ వైప్స్ ని చూస్తే దిమ్మతిరగాల్సిందే. అందంగా ఉండే ఆ విలన్స్ భార్యలు ఎవరెవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

రఘువరన్ :

నేటి తరానికి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ రఘువరన్ ఒకప్పుడు చాలా ఫేమస్ హీరో. 1982లో తమిళ మూవీ ద్వారా ఎంట్రీ ఇచ్చారు. తమిళ, మలయాళ వంటి సినిమాల్లో నటించి చాలా సినిమాల్లో ఫేర్ అవార్డులను అందుకున్నారు. భాష, శివ సినిమాలో విలన్ గా నటన ఎప్పటికీ గుర్తుండిపోయేది. విలన్ పాత్రలను పండించారు. రఘువరన్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆయన ప్రేమించింది ఎవ్వరినో కాదు.. నటి రోహిణిని. చిన్నప్పటి నుంచి సినిమాల్లో నటించిన రోహిణి ఇప్పటివరకు దాదాపు 70కి పైగా సినిమాల్లో నటించి మంచి పేరు సంపాదించుకుంది. రైటర్ గా.. లిరిసిస్ట్ గా.. డైరెక్టర్ గా డబ్బింగ్ ఆర్టిస్టుగా పలు రంగాల్లో రాణిస్తుంది. హీరోయిన్లు జ్యోతిక, ఐశ్వర్యరాయ్, మనిషా కోయిరాల, అమలకు డబ్బింగ్ చెప్పేది రోహిణి. రఘువరణ్ కి ఇంత అందమైన, తెలివైన భార్య ఉన్నదని చాలా మందికి ఇప్పటివరకు కూడా తెలియదు.

అవినాష్ :

అవినాష్ కూడా ఒకప్పుడు ఫేమస్ విలన్. కన్నడ నటుడు. తెలుగులో చాలా సినిమాల్లో నటించాడు. ఇతను నటించిన విలన్ పాత్రలు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. రెండు దశాబ్దాలుగా సిని పరిశ్రమలో ఉంటూ దాదాపు 1600కి పైగా సినిమాల్లో నటించాడు. సంక్లిష్ట, వైవిద్య పాత్రల్లో ఎక్కువగా నటించాడు.అవినాష్ భార్య మాలవిక ఒకప్పటి కన్నడ టాప్ హీరోయిన్. మాలవిక తండ్రి చిత్ర పరిశ్రమకి చెందిన వాడు కావడం, చిన్నప్పటి నుంచి డ్యాన్స్ నేర్చుకోవడంతో సినీరంగ ప్రవేశం చాలా సులువుగా జరిగిపోయింది. తెలుగులో కూడా ఈమె చాలా సినిమాల్లో నటించింది. హీరోయిన్ గాతన హవాను చూపించిన మాలవిక అవినాష్ ని వివాహం చేసుకుంది. వీరికి ఒక బాబు ఉన్నాడు. పెళ్లి తరువాత కూడా టెలివిజన్ సీరియల్స్ లో నటించి మంచి పేరు సంపాదించుకుంది. ఇటీవలే వచ్చిన పాన్ ఇండియా మూవీ కేజీఎఫ్ లో కూడా నటించింది మాలవిక. 

అతుల్ కులకర్ణి :

ఇతను పేరుకు తగినట్టగానే గొప్ప విలన్. తెలుగు, హిందీ, కన్నడ, మరాఠి, ఇంగ్లీషు భాషల్లో నటించాడు. చాలా అవార్డులు సైతంఅందుకున్నాడు. ఆంధ్రవాలా, చంటి, రామ్ వంటి సినిమాల్లో విలన్ గా చేసిన కులకర్ణి భార్య చాలా అందంగా ఉంటుంది. ఈమె గొప్ప నటి కూడా.ఈయన భార్య గీతాంజలి కూడా దాదాపు అన్ని భాషల్లో నటించింది. వీరికి ఇద్దరూ పిల్లలు. ప్రస్తుతం బిజినెస్ రంగంలో రాణిస్తూ కుటుంబాన్ని చూసుకుంటుంది. అన్నింటిలో కూడా భర్తతో సమానంగా దూసుకుపోతుంది గీతాంజలి. 

ఆశీష్ విద్యార్థి :

టాలీవుడ్ లో ఈ మధ్య కాలంలో ఫేమస్ విలన్ లలో ఒకరు అనే చెప్పాలి. వందేమాతరం సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. విలన్ పాత్రలో నటించడం చాలా దిట్ట. తాను నటించిన సినిమాలకు నేషనల్ అవార్డులను కూడా అందుకున్నాడు. తెలుగులో చేసింది కొద్ది సినిమాలే అయినప్పటికీ మంచి పేరు సంపాదించుకున్నాడు ఆశీష్. కన్నడ, హిందీ, తెలుగు, మలయాళం సినిమాలలో నటించిన ఈ విలన్ భార్య పేరు రాజోషి. ఈమె పేరుకు తగ్గట్టేచాలా అందంగా ఉంటుంది. 

మురళీ శర్మ :

టాలీవుడ్, బాలీవుడ్, టెలివిజన్ లలో నటించిన నటుడు మురళీ శర్మ. తెరపై ఒక పోలీస్ పాత్రలో పోషించి అందరినీ మెప్పించాడు. మురళీ శర్మ తెలుగులో విలన్ గా అతిథి, గోపాల గోపాల, కృష్ణం వందే జగద్గురు వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ముఖ్యంగా అతిథి సినిమాలో అద్భుతంగా నటించాడు. ఇతని వైఫ్ కూడా నకు ఏమాత్రం తీసిపోదు. మురళి భార్య అశ్విని కాల్ సెకర్ ఈమెఒక ఫేమస్ యాక్టర్. ఈమె హిందీలో పలు సీరియల్స్ లో నటించింది. తెలుగులో కూడా కొన్ని సినిమాలు చేసింది. బద్రినాథ్ సినిమాలో మురళీ భార్య విలన్ గా నటించింది. 

బిజుమీనన్ :

బిజు మీనన్ చెప్పగానే  తొలు మనకు గుర్తుకొచ్చేది రణం. రణం సినిమాలో విలన్ పాత్ర ద్వారా టాలీవుడ్ ప్రేక్షకులకు చాలా దగ్గరయ్యాడు. తమిళ, తెలుగు సినిమాలతో పాటు దాదాపు 100 మలయాళం చిత్రాల్లో కూడా నటించారు. 1995లో పుత్రన్ లో తొలిసారిగా నటించాడు బిజు మీనన్. ఈయన భార్య పేరు సంయుక్త వర్మ. బిజు భార్య సంయుక్త వర్మ ఒకప్పటి ఫేమస్ మలయాళ హీరోయిన్. 1999లో హీరోయిన్ గా పరిచయమయ్యారు. ఇక ఆ తరువాత పలు మలయాళ సినిమాల్లో నటించింది. ఉత్తమ నటిగా రెండు కేరళ స్టేట్ ఫిలింస్ అవార్డులను దక్కించుకుంది. బిజు మీనన్ ని పెళ్లి చేసుకున్న తరువాత సినిమాల్లో నటించలేదు. ప్రస్తుతం కుటుంబ బాధ్యతలను చూసుకుంటుంది. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

ప్రభాస్ ‘ప్రాజెక్ట్ K’ టీజర్ లాంఛ్ చేసేది ఎక్కడో తెలుసా ?

డాడీ సినిమా చిరు కాకుండా ఆ హీరో చేసుంటే… సూపర్ హిట్ అయ్యుండేదిగా…!

 “బాహుబలి” సినిమాలో దీనిని గమనించారా? ఇదేమిటో, ఎలా పని చేస్తుందో తెలుసా?

Visitors Are Also Reading