Home » మెగాస్టార్ షూటింగ్ స్టార్ట్ చేసిన రవితేజ…!

మెగాస్టార్ షూటింగ్ స్టార్ట్ చేసిన రవితేజ…!

by Azhar
Ad
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఏడాది విడుదలైన ఆచార్య అనే సినిమా మెగాస్టార్ కెరియర్ లో పెద్ద ప్లాప్ సినిమాగా నిలిచింది. అయితే ఆ సినిమాను మరిచిపోయి మెగాస్టార్ ఇప్పుడు వరుస సినిమాలు చేస్తున్నాడు. అందులో మలయాళ బ్లాక్ బస్టర్ లూసిఫర్ సినిమా రీమేక్ గాడ్ ఫాదర్ ఉంది. అలాగే మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ అనే సినిమా చేస్తున్నాడు. అదే విధంగా బాబీ దర్శకత్వంలో వాల్తేర్ వీరయ్య అనే మరో సినిమాలో కూడా చిరు చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ మూడు సినిమా షూటింగ్స్ జరుగుతూనే ఉన్నాయి.
అయితే ఇందులో వాల్తేర్ వీరయ్య గురించి ఫ్యాన్స్ ఎక్కువగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఈ సినిమాలో చిరంజీవితో పాటుగా మాస్ మహారాజ రవితేజ కూడా నటిస్తున్నట్లు తెలిసిందే. అందుకే ఈ ఇద్దరి మాస్ హీరోల కాంబినేషన్ చూడటానికి చాలా మంది ఎదురు చూస్తున్నారు. అయితే ఆ మధ్యలో వాల్తేర్ వీరయ్య షూటింగ్ ఆలస్యం అవుతుంది అని.. అందువల్ల డేట్స్ కుదరని రవితేజ ఈ సినిమా నుండి తప్పుకున్నాడు అనే వార్తలు వచ్చాయి. దాంతో ఆ ఇద్దరి హీరోల ఫ్యాన్స్ కొంత అసంతృప్తికి గురయ్యారు అనేది నిజం.
కానీ తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం.. రవితేజ వాల్తేర్ వీరయ్య సినిమా షూటింగ్ లో పాల్గొన్నాడు అని తెలుస్తుంది. అయితే తాజాగా వాల్తేర్ వీరయ్య సినిమా సిటింగ్ అనేది హైదరాబాద్ లోనే ప్రారంభమైంది. ఇక ఈ షూటింగ్ లో రవితేజ కూడా పాల్గొన్నాడు అని తెలుస్తుంది. దాంతో మళ్ళీ రవితేజ, చిరంజీవి కాంబినేషన్ చూడటానికి ఫ్యాన్స్ కు అవకాశం అనేది దిరికినట్లైంది. గతంలో ఈ ఇద్దరు అన్నయ అనే సినిమాలో కనిసి నటించారు. అప్పుడు అన్నదమ్ములుగా నటించిన రవితేజ, చిరు ఈ వాల్తేర్ వీరయ్య సినిమాలో ఎలా కనిపించబోతున్నారు అనేది చూడాలి.

Advertisement

Visitors Are Also Reading