Telugu News » Blog » టైగర్ నాగేశ్వరరావుపై రవితేజ గోల్..!

టైగర్ నాగేశ్వరరావుపై రవితేజ గోల్..!

by Manohar Reddy Mano
Ads

ఇప్పుడు టాలీవుడ్ లో ఎక్కువ సినిమాలను లైన్ లో పెట్టిన హీరో ఎవరు అంటే మొదట వచ్చే పేరు మాస్ మహారాజ రవితేజ. ప్రస్తుతం తెలుగు హీరోలలో ఏ హీరో కూడా రవితేజ చేస్తున్న అన్ని సినిమాలు చేయడం లేదు. ఈ ఏడాది ఇప్పిటికే ఖిలాడీ , రామారావు ఆన్ డ్యూటీ అనే సినిమాలు విడుదల చేసిన రవితేజ హిట్ అనేది అందుకోలేకపోయారు.

Advertisement

అందుకే ఇప్పుడు చేస్తున్న సినిమాల పైన రవితేజ ఫుల్ ఫోకస్ అనేది చేసాడు అని సమాచారం. తొందరలో ధమాకా అనే సినిమాను విడుదల చేయనున్న రవితేజ రావణాసుర అలాగే టైగర్ నాగేశ్వరరావు అనే సినిమాలు చేస్తున్నాడు. ఇక ఇందులో టైగర్ నాగేశ్వరరావు సినిమాపై రవితేజ ఓ గోల్ అనేది ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తుంది. మాములుగా రవితేజ కథ విని ఓకే చెప్పిన తర్వాత మళ్ళీ ఆ విషయంలో జోక్యం చేసుకోడట.

Advertisement

 

కానీ టైగర్ నాగేశ్వరరావు అనే సినిమా రవితేజ పాన్ ఇండియా సినిమాగ చేస్తున్నాడు. అందుకే ఈ సినిమాను తన కెరియర్ లోనే పెద్ద హిట్ గా చేయాలని రవితేజ ఫిక్స్ అయ్యినట్లు తెలుస్తుంది. ఆ కారణంతోనే ఈ సినిమాను తెరక్కేక్కిస్తున్నా వంశీ కృష్ణతో ప్రతి చిన్న విషయం కూడా చర్చిస్తున్నాడు అని తెలుస్తుంది. అయితే ఈ సినిమా స్టువర్ట్ పురంలో 1970లో పేరుమోసిన గజదొంగ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా.. అతను పోలీసులను ఎలా కష్టపెట్టాడు అనే కోణంలో వస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

ఇవి కూడా చదవండి :

ముంబై జట్టులో ఉంటె సూర్య కెరియర్ నాశనం..!

ఆస్ట్రేలియాలో మళ్ళీ ఆ సెంటిమెంట్ పని చేసేనా..?