Home » విలన్ గా రవితేజ మెప్పిస్తాడా…?

విలన్ గా రవితేజ మెప్పిస్తాడా…?

by Azhar
Ad

ఒక్క భాషలో వచ్చిన సినిమా అనేది మరో భాషల్లో రీమేక్ కావడం అనేది చాలా సహజం. అయితే ఇన్నో రోజులుగా హిట్ లేకుండా సతమతం అవుతున్న తమిళ్ హీరో శింబుకి తాజాగా హిట్ ఇచ్చిన సినిమా అనేది మనాడు. ఈ సినిమా అక్కడ కోలీవుడ్ లో సూపర్ హిట్ కావడంతో ఇక్కడ తెలుగులో ఈ సినిమాను రీమేక్ చేయడానికి సురేష్ ప్రొడక్షన్స్ తీసుకుంది.

Advertisement

కానీ కథలో మన తెలుగు నేటివిటీకి తగ్గిన విధంగా మార్పుల కోసం దానిని దర్శకుడు హరీష్ శంకర్ కు ఇచ్చారట. దాంతో ప్రస్తుతం హరీష్ ఆ పనిలో బిజీగా ఉన్నాడట. ఈ సమయంలో ఈ సినిమాలో పాత్రల ఎంపిక విషయంలో సురేష్ ప్రొడక్షన్స్ ఉంది. అయితే ఇందులో హీరోగా టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డను తీసుకోవాలని సురేష్ ప్రొడక్షన్స్ ప్రయత్నిస్తుంది. అయితే మనాడు సినిమాలో హీరో శింబుతో పాటుగా ఎస్.జె. సూర్య నటించిన విలన్ పాత్ర కూడా చాలా కీలకం అనేది అందరికి తెలిసిందే.

Advertisement

అందువల్ల తెలుగులో రీమేక్ చేయబోతున్న మనాడు ఎస్.జె. సూర్య నటించిన విలన్ పాత్రలో మాస్ మహారాజ రవితేజ అయితే బాగుటుంది అని సురేష్ ప్రొడక్షన్స్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. కానీ ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కువ సినిమాలు కమిట్ అయిన హీరో ఎవరు అంటే అది రవితేజనే. కాబట్టి.. ఈ సమయంలో రవితేజ విలన్ పాత్ర అనేది చేయడానికి ఒప్పుకుంటాడా లేదా అనేది చూడాలి.

ఇవి కూడా చదవండి :

ఐపీఎల్ మినీ వేలం.. బీసీసీఐ కీలక ఆదేశాలు..!

పాకిస్థాన్ కు వెళ్ళం అని తేల్చిన భారత్..!

Visitors Are Also Reading