Home » ఐపీఎల్ మినీ వేలం.. బీసీసీఐ కీలక ఆదేశాలు..!

ఐపీఎల్ మినీ వేలం.. బీసీసీఐ కీలక ఆదేశాలు..!

by Azhar
Ad

ఐపీఎల్ 2023కి బీసీసీఐ పనులను ప్రారంభించి అనే చెప్పాలి. అయితే ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ లోకి రెండు కొత్త జట్లు రావడంతో మెగా వేలం నిర్వహించిన బీసీసీఐ.. వచ్చే ఏడాది జరగనున్న ఐపీఎల్ సీజన్ కోసం మినీ వేలం నిర్వహించనుంది. అయితే ఈ వేలం అనేది డిసెంబర్ 16నే నిర్వహిస్తుంది బీసీసీఐ. అయితే వచ్చే ఏడాది మహిళల ఐపీఎల్ కూడా బీసీసీఐ ప్రారంభిస్తుంది.

Advertisement

అందుకే దానికోసం మెగా వేలం.. ఇంకా జట్ల ప్రకటన వంటి పెద్ద పెద్ద పనులు ఉండటంతో కొంచెం ముందుగానే పురుషుల మినీ వేలంను ముగిస్తుంది. ఇక ఈ మినీ వేలం విషయంలో తాజాగా బీసీసీఐ అన్ని జట్లకు కొన్ని కీలక ఆదేశాలు అనేవి జారీ చేసింది. అదేంటంటే.. ఐపీఎల్ లో ఉన్న అన్ని ఫ్రాంచైజీలకు వచ్చే నెల 15 వరకు బీసీసీఐ గడువు అనేది ఇచ్చింది.

Advertisement

ఈ గడువు లోపల అన్ని జట్లు కూడా ఏ ఏ ఆటగాడిని వదిలేస్తునాం.. ఏ ఏ ఆటగాడిని తమతో ఉంచుకుంటున్నం అనే విషయాన్ని ప్రకటించాల్సి ఉంటుంది. ఆ తర్వాత మినీ వేలంలో మళ్ళీ కావాల్సిన ఆటగాళ్లను జట్టుకు తీసుకోవచ్చు. అయితే ఈ ఐపీఎల్ 2022 మెగా వేలంలో ఫ్రాంచైజీల పార్స్ వ్యాల్యూ అనేది 90 కోట్లు మాత్రమే ఉండగా.. ఈ మినీ వేలంలో దానిని 95 కోట్లకు పెంచేశారు. చూడాలి మరి ఈ వేలంలో ఏ ఏ ఆటగాడు జట్లు మారుతారు అనేది.

ఇవి కూడా చదవండి :

పోయినసారి మ్యాచ్ తర్వాత.. ఇప్పుడు మ్యాచ్ కంటే ముందే..?

ఏ జట్టును ఎలా ఓడించాలో నాకు తెలుసు..!

Visitors Are Also Reading