Home » కోచింగ్ పై రవిశాస్త్రి షాకింగ్ నిర్ణయం..!

కోచింగ్ పై రవిశాస్త్రి షాకింగ్ నిర్ణయం..!

by Azhar
Ad
భారత జట్టుకు మాజీ హెడ్ కోచ్ గా ఉన్న రవిశాస్త్రి మళ్ళీ కోచింగ్ చెయ్యడంపై కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసాడు. అయితే 2017 లో భారత జట్టుకు హెడ్ కోచ్ గా బాధ్యతలు చేప్పట్టిన రవిశాస్త్రి.. జట్టును బలంగా మార్చాడు. ముఖ్యంగా జట్టు యొక్క బెంచ్ బలాన్ని పెంచింది రవిశాస్త్రి అనే చెప్పాలి. అందుకు నిదర్శనం.. సీనియర్ ఆటగాళ్లు ఎవరు లేకున్నా.. ఆస్ట్రేలియాలో సాధించిన టెస్ట్ విజయం.
అయితే రవిశాస్త్రి కోచింగ్ లో కెప్టెన్ గా విరాట్ కోహ్లీ కూడా బాగా రాణించాడు. వీరి కాంబోలో జట్టు ఎన్నో అద్భుతమైన విజయాలు అందుకుంది. కానీ ఐసీసీ టైటిల్ మాత్రం గెలవలేకపోయింది. అయితే గత ఏడాది జరిగిన ప్రపంచ కప్ తర్వాత హెడ్ కోచ్ గా రవిశాస్త్రి.. కెప్టెన్ గా విరాట్ కోహ్లీ ఇద్దరు ఒక్కే సారి తప్పుకున్నారు. ఆ తర్వాత ద్రావిడ్ హెడ్ కోచ్ గా వచ్చాడు.
కానీ ద్రావిడ్ జట్టుతో వ్యవరిస్తున తీరు అనేది ఫ్యాన్స్ కు ఆనందాన్ని ఇవ్వలేకపోతుంది. అందుకే రవిశాస్త్రి మళ్ళీ హెడ్ కోచ్ గా రావాలి అని కోరుకుంటున్నారు. ఈ విషయంపైన రవిశాస్త్రి స్పందిస్తూ.. నేను కోచ్ గా ఏం చేయగలనో ఆదంతా నా 5 ఏళ్ళ పదవి కాలంలో చేసేసాను. ఇప్పుడు నేను ఆటను ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నాను. ఇక నేను మళ్ళీ కోచింగ్ అనేది ఎప్పుడు చేయను అని రవిశాస్త్రి కుండా బద్దలు కొట్టేసాడు.

Advertisement

Visitors Are Also Reading