Home » షమీ ప్రపంచ కప్ లో లేకపోవడానికి అసలు కారణం ఇదే..!

షమీ ప్రపంచ కప్ లో లేకపోవడానికి అసలు కారణం ఇదే..!

by Azhar
Ad
ఆస్ట్రేలియాలో వచ్చే నెలలో ప్రారంభం కానున్న ఐసీసీ టీ20 ప్రపంచ కప్ కోసం బీసీసీఐ ఇప్పటికే జట్టును ప్రకటించగా.. దాని పై విమర్శలు అనేవి వచ్చాయి. ముఖ్యంగా షమీ లాంటి సీనియర్ బౌలర్ ను స్టాండ్ బై గా ఎంపిక చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసారు ఫ్యాన్స్. కానీ షమీని జట్టులోకి తీసుకోకపోవడానికి బీసీసీఐ సెలక్షన్ కమిటీ సభ్యుడు ఒక్కరు క్లారిటీ ఇచ్చారు.
బీసీసీఐ సభ్యుడు మాట్లాడుతూ.. షమీ స్టాండ్ బై గా యూత్ జట్టులో ఉన్నట్లే. అతడిని బుమ్రా, హర్షల్ పటేల్ కు బ్యాకప్ ఆటగాడిగా ఎంపిక చేసాము. షమీ గత 9 నెలలుగా టీ20 మ్యాచ్ లు ఆడలేదు. కాబట్టి అలాంటి ప్లేయర్ ను నేరుగా జట్టులోకి తీసుకోవడం వీలు కాదు. ఇక షమీ లేనపుడు హర్షల్ పటేల్ బాగా రాణించడంతో అతడిని ఎంపిక చేసాము. అయిన షమీ జట్టులో లేనట్లు కాదు.
ఈ ప్రపంచ కప్ ముందు ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికాతో జరగబోతున్న టీ20 సిరీస్ లలో ఈ ముగ్గురు బౌలర్లు తమ సత్తా ఏంటి అనేది నిరూపించుకోవాలి. ఇందులో రాణిస్తే షమీ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఇక బుమ్రా, హర్షల్ యొక్క ఫిట్నెస్ పైన అనుమలను ఉన్నాయి. కాబట్టి వారి స్థానంలో షమీని జట్టులోకి తీసుకోవచ్చు. కానీ దాని కోసం 9 నెలలు టీ20లు ఆడని షమీ.. ఈ రెండు సిరీస్ లలో రాణించాలి అని ఆ బీసీసీఐ అధికారి పేర్కొన్నారు.

Advertisement

Visitors Are Also Reading