Home » Ravanasura : రావణాసుర టీజర్ రిలీజ్… అరివీర భయంకరంగా రవితేజ

Ravanasura : రావణాసుర టీజర్ రిలీజ్… అరివీర భయంకరంగా రవితేజ

by Bunty
Ad

 

ధమాకా మూవీ సూపర్ సక్సెస్ తో మాస్ మహారాజా రవితేజ మళ్ళీ గాడిలో పడ్డాడు. ఈ మూవీ 100 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇక ఇప్పుడు అతడు తన నెక్స్ట్ మూవీ రావణాసురపై ఆశలు పెట్టుకున్నాడు. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీపై రవితేజ అభిమానుల్లోనూ భారీ అంచనాలే ఉన్నాయి. స్వామి రారా ఫేమ్ సుధీర్ వర్మ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు.

READ ALSO : “బలగం” వివాదంపై జబర్దస్త్ వేణు క్లారిటీ.. అసలు కథ ఎవరిదంటే ?

Advertisement

ఇక ఈ సినిమాలో అక్కినేని హీరో సుశాంత్ ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాడు. ఈ మూవీ నుంచి తాజాగా ఓ సూపర్ అప్డేట్ వచ్చింది. తాజాగా రావణాసుర టీజర్ రిలీజ్ అయింది. ఈ టీజర్ లో అరివీర భయంకరంగా రవితేజ ఉన్నారు. సీతను తీసుకెళ్లాలంటే, ఈ రావణాసురున్ని దాటి వెళ్లాలంటూ రవితేజ చెప్పే డైలాగ్ అదిరిపోయింది. మొత్తానికి ఈ టీజర్ సినిమాపై హైప్ తెచ్చింది. కాగా, రావణాసుర మూవీ షూటింగ్ ఇప్పటికే పూర్తయింది.

Advertisement

Read Also : అన్న కొడుకు కోసం బాలయ్య తపన.. కృతజ్ఞతలు తెలిపిన విజయసాయిరెడ్డి

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ మూవీని ఏప్రిల్ 7న రిలీజ్ చేయనున్నారు. రావణాసుర మూవీని అభిషేక్ నామ, రవితేజ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్, బీమ్స్ సిసిరోలియో ఈ మూవీకి మ్యూజిక్ అందిస్తున్నారు. ఇక రావణాసుర మూవీలో శ్రీరామ్, అను ఎమ్మాన్యూయల్, మేఘ ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్ష నాగర్కర్, పూజిత పొన్నాడా, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్ ఇతర ముఖ్యమైన పాత్రల్లో కనిపిస్తున్నారు.

READ ALSO : భూమా మౌలిక ఆస్తుల విలువ ఎంతో తెలుసా… మనోజ్ కంటే ఎక్కువైనా?

Visitors Are Also Reading