Home » రావణాసుర ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. అప్పుడేనా?

రావణాసుర ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. అప్పుడేనా?

by Anji
Ad

మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన తాజా చిత్రం రావణాసుర. విలక్షణ సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు సుధీర్ వర్మ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఏప్రిల్ 07న ప్రేక్షకుల ముందుకొచ్చింది.  అభిషేక్ ఆర్ట్స్ బ్యానర్ మీద అభిషేక్ నామ ఈ చిత్రాన్ని రవితేజ ఆర్ట్స్ బ్యానర్ పై రవితేజతో కలిసి సంయుక్తంగా నిర్మించారు.  

Also Read :  IPL ల్లో చాహల్ బిజీ…. శ్రేయస్ తో మళ్ళీ చాహల్ భార్య అడ్డంగా దొరికిపోయిందిగా!

Advertisement

ఈ సినిమాలో రవితేజ సరసన అను ఇమ్మానుయేల్ హీరోయిన్ గా నటించింది. ఫరియా అబ్దుల్లా, దక్ష నాగర్కర్, పూజిత పొన్నాడ, మేఘ ఆకాశ్ వంటి వారు ఇతర కీలక పాత్రల్లో నటించారు. వాస్తవానికి ఈ చిత్రం కంటే ముందే విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ అన్నింటికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.రవితేజ ఓ నెగిటివ్ పాత్రలో కనిపిస్తున్నట్టు హింట్ ఇవ్వడంతో ఈ చిత్రంపై ప్రేక్షకులందరిలో ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం పాజిటివ్ టాక్ దక్కించుకొని వసూళ్ల విషయంలో పరుగులు పెడుతుండగా.. ఈ చిత్రం ఓటీటీలో ఎప్పుడు విడుదలవుతుందనే విషయంపై ఆసక్తి నెలకొంది. ఈ సినిమా ఓటీటీ పార్ట్ నర్ కి సంబంధించిన వార్త ఒకటి బయటికొచ్చింది.  

Advertisement

Also Read :  Pushpa 2 టీజర్ లో ఈ షాట్స్ అద్భుతం….సుకుమార్ లాజిక్స్ క్రియేటివిటీ క్యాచ్ చేశారా?

ఈ సినిమా ఓటీటీ హక్కులు, ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ భారీ ధరకు దక్కించుకుంది. నిర్మాతలతో ఉన్న ఒప్పందం ప్రకారం.. ఈ చిత్రం విడుదలైన 50 రోజుల తరువాత మాత్రమే ఈ సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన శాటిలైట్ రైట్స్, జీ తెలుగు సంస్థ దక్కించుకుంది. జీ తెలుగు ఛానల్ లో ఈ చిత్రం టీవీలలో టెలికాస్ట్ కానుంది. 50 రోజులు అంటే దాదాపు మే చివరి వారంలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

Also Read :   ఒక్క క్ష‌ణం కూడా నిన్ను మ‌ర్చిపోలేను…తార‌క‌ర‌త్నభార్య ఎమోష‌న‌ల్..!

Visitors Are Also Reading