Home » వ‌రంగ‌ల్ ఎంజీఎంలో గుంపులుగా ఎలుక‌లు.. రోగుల్లో గుబులు

వ‌రంగ‌ల్ ఎంజీఎంలో గుంపులుగా ఎలుక‌లు.. రోగుల్లో గుబులు

by Anji
Ad

వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో ఎలుకల బెడద విపరీతంగా పెరిగింది. పేరున్న పెద్ద ఆసుపత్రి అని ఎంతో మంది వైద్యులు నర్సులు ఉన్నారని, ఇక్కడ మెరుగైన వైద్యం అందుతుదని ఇక్కడికి వస్తే ఇక్కడ కొత్త రోగాన్ని తెచ్చుకోవాల్సి వస్తోంది. ఇటీవ‌లే వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో అపస్మారక స్థితిలో ఉన్న రోగి శ్రీనివాస్ ఎలకల దాడిని ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే జిల్లా అదనపు కలెక్టర్ తో విచారణ చేపట్టేందుకు ఆదేశించారు.

Also Read :  త్వ‌రలోనే కేసీఆర్ బ‌యోపిక్…ఆర్జీవీ రిస్క్ చేస్తున్నాడా..!

Advertisement


ఎలకల దాడి వాస్తవం అన్న నివేదికతో విచారణకు ఆదేశించిన ఆరు గంటల లోపే చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ఎంజీఎం సూపరింటెండెంట్ గా ఉన్న శ్రీనివాసరావును బదిలీ చేశారు. ఆయన స్థానంలో వీ. చంద్రశేఖర్ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినది. నిర్లక్ష్యం వహించిన ఇద్దరు వైద్యుల పై సస్పెన్షన్ వేటు వేసింది. కరోనా సమయంలో సమర్థవంతంగా సేవలు అందించిన జనరల్ ఆస్పత్రి మెడిసిన్ ప్రొఫెసర్ చంద్రశేఖర్ మళ్లీ సూపరింటెండెంట్ బాధ్య‌త‌లు అప్పగించింది. ఇవాళ ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు.

Advertisement


ప్రాణాలను నిలబెట్టుకునేందుకు పెద్ద ఆస్పత్రికి వస్తే రోగం మాట దేవుడెరుగు కాని ఎలకల దాడితో రోగుల కుటుంబసభ్యులు బెంబేలెత్తుతున్నారు. ఎన్నో నిద్ర లేని రాత్రులను గడుపుతున్నారు. ఎంజీఎం ఆస్పత్రిలో ఎవరిని తట్టినా ఎలకల పురాణమే చెబుతున్నారు. రోగికి సంబంధించి ఇద్దరు కుటుంబ సభ్యులు ఉంటే ఒకరు పడుకుంటే మరొకరు కాపలా కాయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు నర్సులు, వైద్యులు పేర్కొంటున్నారు.


1300 పడకలు, 24 వైద్య విభాగాలు కలిగిన ఎంజీఎం ఆస్పత్రికి తో సహా ఇతర జిల్లాల నుంచి చికిత్సకోసం వస్తుంటారు. కొందరి నిర్లక్ష్యం కారణంగా ఆస్పత్రి అప్రతిష్టపాలు అవుతోంది. 2017 లో మార్చురీలో మృతదేహాలు ఎలుకలు కొరుక్కు తినడం కలకలం రేపింది. 2018లో ఓ మృత శిశువును కూడా ఎలుకలు కొరుక్కు తిన్నాయి. అప్పటినుంచి ఎలుకల బెడద వేధిస్తూనే ఉంది. ముఖ్యంగా ఆసుపత్రి ప్రాంగణంలో చెత్తాచెదారం తో పాటు మురుగు నరు పారుదల వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో ఎలుకలు వస్తున్నాయని బాధితులు పేర్కొంటున్నారు.

Also Read :  ఈ ఫోటోలో బాల‌కృష్ణ ప‌క్క‌న ఉన్న ఈమె ఎవ‌రో చెప్పుకోండి చూద్దాం..!

Visitors Are Also Reading