Home » త్వ‌రలోనే కేసీఆర్ బ‌యోపిక్…ఆర్జీవీ రిస్క్ చేస్తున్నాడా..!

త్వ‌రలోనే కేసీఆర్ బ‌యోపిక్…ఆర్జీవీ రిస్క్ చేస్తున్నాడా..!

by AJAY
Ad

వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు ఆర్జీవీ వ‌రుస సినిమాలు చేస్తూ వార్త‌ల్లో నిలుస్తూ ఉంటారు. చేసే సినిమాల కంటే వ‌ర్మ ఎక్కువ‌గా వివాదాల‌తోనే వార్త‌ల్లో హాట్ టాపిక్ అవుతుంటారు. చేసే సినిమా హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా అన్న‌ది ప‌ట్టించుకోకుండా సినిమా చేసామా విడుద‌ల చేసామా అన్న చందంగా సినిమాలు చేస్తున్నాడు. అంతే కాకుండా న‌చ్చితే చూడండి లేక‌పోతే మానేయండి అంటూ కూడా వ‌ర్మ నేరుగా చెబుతారు.

Advertisement

ఇక ఆ సినిమాల‌ను కూడా వ‌ర్మ ఫ్యాన్స్ త‌ప్ప మ‌రొక‌రు చూడ‌టం లేన‌ట్టుగా సినిమాల‌కు వ‌చ్చే క‌లెక్ష‌న్స్ చూస్తే అర్థం అవుతోంది. కానీ ఆర్జీవి బ‌యోపిక్ ల విష‌యంలో మాత్రం ప్ర‌శంస‌లు అందుకుంటూ ఉంటారు. బ‌యోపిక్ చేయాలంటే ముందుగా ఆర్జీవీ పేరే ఎక్కువ‌గా వినిపిస్తూ ఉంటుంది. ర‌క్త‌చ‌రిత్ర తో పాటూ వ‌ర్మ ఎన్నో బ‌యోపిక్ లు చేశారు. రీసెంట్ గా వ‌రంగల్ మాజీ ఎమ్మెల్యే కొండా ముర‌ళి బ‌యోపిక్ ను సైతం తెర‌కెక్కించార‌.

Advertisement

Ramgopal varma

Ramgopal varma

ఇక ఆర్జీవీ రీసెంట్ గా డేంజ‌రెస్ అనే సినిమా షూటింగ్ ను పూర్తిచేసి సినిమా విడుద‌ల‌కు సిద్ద‌మ‌య్యారు. దాంతో సినిమా ప్ర‌మోష‌న్స్ కోసం మీడియాకు ఇంట‌ర్వ్యూలు ఇస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో ఆర్జీవీ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. బాలీవుడ్ లో వ‌చ్చిన క‌శ్మీర్ ఫైల్స్ సినిమా చూసాన‌ని న‌చ్చింద‌ని చెప్పారు. ఏపీ టికెట్ల విష‌యంలో త‌న‌కు ఎలాంటి ఇబ్బంది లేద‌ని అన్నారు. అంతే కాకుండా తాను త్వ‌ర‌లోనే తెలంగాణ సీఎం కేసీఆర్ బ‌యోపిక్ ను తెర‌కెక్కిస్తాన‌ని వ‌ర్మ అనౌన్స్ చేశారు.

అయితే ఆర్జీవీ బ‌యోపిక్ అంటే త‌న‌కు న‌చ్చిన‌ట్టుగా చూపిస్తాడు. ఉన్న‌ది ఉన్న‌ట్టుగా చూపిస్తాడా లేదంటే వివాదాస్ప‌దంగా తీస్తాడా అన్న‌ది తెలియాలి. ఒక‌వేల వివాదాస్ప‌దంగా తీస్తే మాత్రం వ‌ర్మ ప్ర‌భుత్వంతో పెట్టుకుని చిక్కుల్లో ప‌డే అవ‌కాశాలు కూడా ఉన్నాయి. ఇదిలా ఉంటే వ‌ర్మ డేంజ‌రెస్ సినిమాను లెస్బియ‌న్ క‌థాంశం ఆధారంగా తెర‌కెక్కించారు. సినిమాలో గంగూలీ, అప్స‌ర లీడ్ రోల్స్ చేశారు.

Visitors Are Also Reading