Home » రష్మికకు ఉంగరం తొడిగిన విజయ్ దేవరకొండ.. ఇక జరిగేది పెళ్లేనా..?

రష్మికకు ఉంగరం తొడిగిన విజయ్ దేవరకొండ.. ఇక జరిగేది పెళ్లేనా..?

by Sravanthi Pandrala Pandrala

తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొన్ని లవ్ స్టోరీలు అలా కొనసాగుతూ వెళ్తాయి. కొన్ని లవ్ స్టోరీలు పెళ్లి వరకు వెళ్తాయి. కానీ కొంతమంది నటీనటులు లవ్ స్టోరీలు మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంటాయి. అలాంటి లవ్ స్టోరీలలో ముందుగా చెప్పుకోవాల్సింది విజయ్ దేవరకొండ రష్మిక మందన్న.. వీరిద్దరి కాంబినేషన్ అంటే చాలా మంది ఫ్యాన్స్ కి ఇష్టం. అందుకే ఇద్దరు ప్రేమయాణం కొనసాగిస్తూ వస్తున్నారు. గీత గోవిందం అనే మూవీతో అభిమానుల మనసు దోచుకున్న ఈ జంట మంచి గుర్తింపు సాధించింది. ఈ సినిమా తర్వాత రష్మిక మందన్న తన ఎంగేజ్మెంట్ ని కూడా క్యాన్సల్ చేసుకుందట. దీనికి కారణం విజయ్ దేవరకొండ అని అప్పట్లో అనేక వార్తలు వినిపించాయి.

Also Read:జగన్ కు బాలయ్య మాస్ వార్నింగ్… సైకో ప్రభుత్వానికి చమరగీతం పాడాలని పిలుపు…

ఇక గీత గోవింద మూవీ తర్వాత డియర్ కామ్రేడ్ చిత్రంలో కూడా ఈ జంట ఫ్యాన్స్ కు మంచి హిట్ ఇచ్చింది. అందులో కూడా లి* లా* తో అందరినీ ఆకట్టుకున్నారు. రెండు సినిమాల తర్వాత వీరిద్దరి మధ్య ఏదో నడుస్తుందని అనేక రూమర్స్ వచ్చాయి. ఇక బయట ఎక్కడ చూసినా ఇద్దరు కలిసే కనిపించడంతో వీరి మధ్య ప్రేమ ఉందని ఫిక్స్ అయిపోయారు. అంతేకాదు పెళ్లికూడా చేసుకోబోతున్నారని అప్పట్లో అనేక వార్తలు వినిపించాయి. ఈ క్రమంలో వీరు స్పందించి మేమిద్దరం స్నేహితులమే కానీ ప్రేమికులం కాదని కాస్త చెప్పే ప్రయత్నం చేశారు. అయినా ఎవరు నమ్మడం లేదు.

Also Read:పెళ్లికి ముందు తండ్రి కొడుక్కి నేర్పించాల్సిన 4 విష‌యాలు..2వ‌ది ఇంపార్టెంట్!

విజయ్ దేవరకొండ మాత్రం పట్టించుకోడు, రష్మిక ఎప్పటికప్పుడు సీరియస్ గా తీసుకుంటూ స్పందిస్తుంది. ఇదిలా ఉండగా తాజాగా ట్విట్టర్లో రష్మిక విజయ్ దేవరకొండ గురించి ఒక పోస్ట్ వైరల్ అవుతుంది. రష్మిక విజయ్ డే**గ్ చేస్తున్న విషయం నిజమే.. విజయ్ దేవరకొండ తన ఫేవరెట్ రింగ్ ను రష్మిక చేతికి పెట్టారు. వీరిద్దరూ కలిసి ఒకే ఇంట్లో ఒకే రూమ్లో కలిసి ఉంటున్నారట. మనం త్వరలోనే ఒక గుడ్ న్యూస్ వింటాం అంటూ చెప్పుకొచ్చాడు. దీనికి రష్మిక మందన్న బదులిస్తూ.. అయ్యో అతిగా ఆలోచించకు బాబు.. అంటూ కౌంటర్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ట్విట్ నెట్టింట వైరల్ గా మారింది.. ఈ తరుణంలో చాలామంది నెటిజెన్సు ఇక రింగు తోడిగాడు పెళ్లే భాకీ ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు.

Also Read:పేపర్ లీకేజ్ లో ఎన్ని విచిత్రాలో.. ప్రియురాలు కోసం డీఏఓ పేపర్ కొనుగోలు చేసిన ప్రియుడు..!

Visitors Are Also Reading