Home » ఎన్టీఆర్ కోసం రెమ్యునరేషన్ పెంచేసిన రష్మిక..!

ఎన్టీఆర్ కోసం రెమ్యునరేషన్ పెంచేసిన రష్మిక..!

by Azhar
Ad
యంగ్ టైగెర్ ఎన్టీఆర్ ఈ ఏడాది ఆర్ఆర్ఆర్ సినిమాతో ఫ్యాన్స్ ను అలరించాడు. రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా పాన్ ఇండియా లెవల్ లో సూపర్ హిట్ గా నిలిచింది. కానీ ఈ సినిమాలో ఎన్టీఆర్ ను కొంచెం తక్కువ చేసి చూపించారు అని ఆయన ఫ్యాన్స్ ఫీల్ అయ్యారు అనేది నిజం. అందుకే ఎన్టీఆర్ కొత్త సినిమా కోసం ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నారు.
అయితే ఎన్టీఆర్ ఇప్పుడు కొరటాల శివతో సినిమా చేయనున్నట్లు తెలిసిందే. కానీ ఈ సినిమా అనేది ఇంకా సెట్స్ పైకి వెళ్ళలేదు. కొరటాల ఆచార్య డిజాస్టర్ నుండి ఇంకా బయట పడలేదు అని.. అందుకే ఆలస్యం అవుతుంది అని తెలుస్తుంది. ఇక దొరికిన ఈ గ్యాప్ లో ఎన్టీఆర్ సినిమాకు హీరోయిన్ ను వెతికింది చిత్ర యూనిట్. మొదట ఈ సినిమాలో జాన్వీ కపూర్ నటిస్తుంది అని ప్రచారం జరిగింది.
కానీ జాన్వీకి డేట్స్ అనేవి కుదరకపోవడంతో ప్రస్తుతం తెలుగులో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న రష్మిక మందన్నను ఫిక్స్ చేశారు. ఇక ఈ మధ్యే పుష్ప వంటి పాన్ ఇండియా హిట్ ఖాతాలో వేసుకున్న రష్మిక ఈ ఎన్టీఆర్ సినిమా కోసం రెమ్యునరేషన్ పెంచినట్లు తెలుస్తుంది. ఇప్పటివరకు మూడు నుండి నాలుగు కోట్ల మధ్య ఒక్కో సినిమాకు తీస్కుని రష్మిక ఎన్టీఆర్ సినిమా కోసం మాత్రం ఏకంగా 5 కోట్లు అడుగుతుంది అని ప్రచారం జరుగుతుంది.

Advertisement

Visitors Are Also Reading