సూపర్ స్టార్ రజనీకాంత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన నటనకి, పంచ్ డైలాగ్స్ కి ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ఇప్పటికే ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు సూపర్ స్టార్ రజినీకాంత్. ఇక తాజాగా రజనీకాంత్ నటించిన చిత్రం ‘జైలర్’. ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. ఇక ఈ సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న సమయంలోనే రజినీకాంత్ మరో సినిమా ప్రాజెక్టుకి ఒకే చెప్పారట. జై భీమ్ దర్శకుడు టీజే జ్ఞానవేల్ తో సినిమా చేయడానికి సిద్ధమయ్యాడట.
Rana Daggubati onboard Rajinikanth’s film with director TJ Gnanavel
ఇప్పటికే అఫీషియల్ గా అనౌన్స్ చేసిన ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఈ సినిమాలో రజనీకాంత్ తో పాటు బిగ్ బి అమితాబచ్చన్ నటించనున్నట్లు సమాచారం అందుతుంది. ఇక ఈ సినిమా టైటిల్ ‘తలైవార్ 171’ అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాకి సంబంధించి ఎప్పటికప్పుడు ఏదో ఒక అప్డేట్ రివీల్ అవుతూనే ఉంది. ఈ సినిమాలో తాజాగా రానా నటించబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.
Advertisement
Advertisement
Jailer
నిజానికి ఈ సినిమాలో శర్వానంద్ నటిస్తున్నాడని ఒకప్పుడు వార్తలు వచ్చాయి. ఇక శర్వానంద్ ప్లేస్ లో రానా నటిస్తున్నారా లేక వీరిద్దరూ ఈ సినిమాలో నటిస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది. ఈ సినిమాలో రానా విలన్ గా నటించబోతున్నాడట. హీరోగా కన్నా విలన్ గానే రానా చాలా అద్భుతంగా నటిస్తాడు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ చెన్నైలో ప్రారంభం కాబోతుందట. ఈ సినిమాలో రజనీకాంత్ ఒక ఎన్కౌంటర్ లో సస్పెండ్ అయిన పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించబోతున్నారట.
ఇవి కూడా చదవండి
- పవన్ కల్యాణ్ నటికి విడాకులు .. పెళ్లైన ఏడాదికే భర్తకు దూరంగా..?
- ఎన్టీఆర్ చనిపోవాలని క్షుద్రపూజలు చేశారు – లక్ష్మీపార్వతి
- ఇంతకీ శ్రీదేవి మరణానికి కారణం ఏంటి ?? సీక్రెట్ బయటపెట్టిన భర్త