Home » మహేష్ సినిమాలో ఆ సీనియర్ హీరోయిన్ .. ఏ పాత్రలో అంటే..?

మహేష్ సినిమాలో ఆ సీనియర్ హీరోయిన్ .. ఏ పాత్రలో అంటే..?

by Azhar
Ad
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ తో కలిసి సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. దాదాపు రెండున్నర ఏళ్ళు తర్వాత సర్కారు వారి పాట అనే సినిమాతో వచ్చిన మహేష్ ఇప్పుడు 12 ఏళ్ళ తర్వాత మళ్ళీ త్రివిక్రమ్ తో కలిసి సినిమా చేయడం పట్ల ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఆన్నారు. ఇక ఈ సినిమాలో మహేష్ కు జంటగా పూజా హేగ్దే నటిస్తున్న విషయం తెలిసిందే.
అయితే ఈ సినిమా అనేది ఎప్పుడో ప్రకటించిన కూడా.. చాలా కారణాల వల్ల పట్టాలెక్కడం అనేది ఆలస్యం అయ్యింది. ఇక ఈ మధ్యే ఈ సినిమా షూటింగ్ అనేది ప్రారంభం అయ్యింది. ఇక యాక్షన్ సీన్స్ తో త్రివిక్రమ్ ఈ సినిమాను ప్రారంభించారు. వచ్చే ఏడాది ఏప్రిల్ లోపు ఈ సినిమాను విడుదల చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఈ సినిమాపై చాలా రకాల వార్తలు అనేవి వస్తున్నాయి. ఇక ఇప్పుడు తాజాగా మరో వార్త అనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్.. ఇప్పుడు తెగ బిజీగా గడుపుతున్న రమ్యకృష్ణ.. ఈ సినిమాలో కనిపించబోతుంది అని తెలుస్తుంది. అది కూడా మహేష్ కు అత్తగా.. హీరోయిన్ పూజాకు తల్లి పాత్రలో రమ్యకృష్ణ కనిపిస్తుంది అని సమాచారం. అయితే గతంలో నాని సినిమాలో మహేష్ తో చిందులు వేసిన రమ్యకృష్ణ.. ఇప్పుడు ఎలా మెప్పిస్తుందో చూడాలి.

Advertisement

Visitors Are Also Reading