Home » భారత్ మార్పుల వల్లే ఓడిపోయింది..!

భారత్ మార్పుల వల్లే ఓడిపోయింది..!

by Azhar
Ad

భారత జట్టు ఆసియా కప్ 2022 లో అభిమానులను నిరాశపరిచిన విషయం తెలిసిందే. యూఏఈ వేదికగా ప్రారంభమైన ఈ టోర్నీలో ఇండియానే టైటిల్ ఫెవరెట్ అనేది అందరికి తెలుసు. అందుకు తగిన విధంగానే భారత జట్టు మొదట గ్రూప్ దశలో ఆడిన రెండు మ్యాచ్ లలో గెలిచి సూపర్ 4కు వెళ్ళింది. కానీ అక్కడ పాకిస్థాన్, శ్రీలంక చేతిలో ఓడిపోయి అక్కడి నుండే ఇంటికి వచ్చేసింది.

Advertisement

అయితే భారత జట్టు ఫైనల్స్ కు వెళ్తుంది అని అనుకున్న అభిమానులను జట్టు నిరాశపరిచింది అనే చెప్పాలి. ఈ క్రమంలోనే చాలా మంది ఇండియా చేసిన తప్పుల గురించి మాట్లాడారు. ఇక తాజాగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మెన్ రమీజ్ రాజా కూడా ఇండియా ఓటమిపై కామెంట్స్ చేసాడు. ఇండియా తాము చేసుకున్న మార్పుల వల్లే ఓడిపోయింది అని చెప్పాడు..

Advertisement

రమీజ్ రాజా మాట్లాడుతూ.. మొదట పాకిస్థాన్ ఎందుకు ఒక్కే జట్టుతో ఆడుతుంది అని ప్రశ్నించాడు. జట్టులో ఆటగాళ్లు గాయాలకు గురైనప్పుడు.. ఓటములు వస్తున్నప్పుడు జట్టులో మార్పులు జరుగుతాయి. కానీ భారత జట్టు విన్నింగ్ జట్టులో కూడా మార్పులు చేసింది. రిజర్వ్ బెంచ్ బలం కోసం ప్రయోగాలు చేసింది. అందుకే కాంబినేషన్ సెట్ కాకా ఓడిపోయింది అని పేర్కొన్నాడు. అయితే ఈ ఆసియా కప్ లో 5 మ్యాచ్ లు ఆడిన టీం ఇండియా ప్రతి మ్యాచ్ లోను జట్టులో మార్పులతోనే వచ్చింది అనేది అందరికి తెలిసిందే.

ఇవి కూడా చదవండి : Sports

విరాట్ భార్య ఐరన్ లేడీ..!

ఊర్వశి పై నసీమ్ షా షాకింగ్ కామెంట్స్..!

Visitors Are Also Reading