Home » ఊర్వశి పై నసీమ్ షా షాకింగ్ కామెంట్స్..!

ఊర్వశి పై నసీమ్ షా షాకింగ్ కామెంట్స్..!

by Azhar
Ad

ఈ మధ్య కాలంలో ఊర్వశి రౌతేలా పేరు అనేది చాలా ట్రెండ్ అవుతుంది. కానీ అందుకు కారణం ఆమె చేస్తున్న సినిమాలు మాత్రం కాదు. ఆమె చేసిన కొన్ని వేరే పనుల వల్ల. అయితే మొదట ఊర్వశి రౌతేలాకు అలాగే భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ కు మధ్య ఏదో ఉంది అనే వార్తలు చెక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. దానిపైన ఈ ఇద్దరు కూడా కొన్ని కామెంట్స్ చేసుకున్నారు.

Advertisement

ఇక ఆ తర్వాత ఇండియా, పాకిస్థాన్ మధ్య ఆసియా కప్ లో భాగంగా జరిగిన రెండు మ్యాచ్ లకు కూడా ఊర్వశి రౌతేలా వచ్చింది. దాంతో ఆమె పంత్ కోసం వచ్చింది అని అనుకున్నారు. కానీ ఊర్వశి రౌతేలా తన ఇంస్టా స్టోరీలో పాకిస్థాన్ యంగ్ బౌలర్ నషీమ్ షా యొక్క వీడియో అనేది పెట్టడంతో వీరి మధ్య ఏదో జరుగుతుంది అని వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలపైన తాజాగా నషీమ్ స్పందించాడు.

Advertisement

తాజాగా ఊర్వశి రౌతేలా పెట్టిన వీడియో గురించి నషీమ్ కు ప్రశ్న అనేది ఎదురుకాగా.. ఊర్వశి రౌతేలా ఎవరి నాకు తెలియదు. ఆమెను నేను ఇప్పటివరకు చూడను కూడా చూడలేదు. ఇక ఆమె ఏం వీడియో పెట్టింది కూడా నాకు తెలియదు. అయితే ఇలా నన్ను ప్రజలు అభిమానిస్తున్నారు అంటే అది నాకు సంతోషం కలిగించే విషయమే అని నషీమ్ షా కామెంట్స్ చేసాడు.

ఇవి కూడా చదవండి :

విరాట్ భార్య ఐరన్ లేడీ..!

ప్రపంచ కప్ కూడా బుమ్రా లేనట్టేనా..?

Visitors Are Also Reading