Home » ఇండియా ఫ్యాన్స్ మంచోళ్ళు అంటూ సొంత ఫ్యాన్స్ కు పాక్ విమర్శలు..!

ఇండియా ఫ్యాన్స్ మంచోళ్ళు అంటూ సొంత ఫ్యాన్స్ కు పాక్ విమర్శలు..!

by Azhar
Ad
క్రికెట్ అనేది మన దేశంలో ఎత్తి పెద్ద ఆట అనే చెప్పాలి. దేశంలో ఉన్న వారిలో ఎక్కువ మంది ఇష్ట పడే ఈ ఆటను మన దాయాది దేశం అయిన పాకిస్థాన్ లో కూడా ఎక్కువగానే ఇష్టపడుతారు. ఇక ఈ రెండు దేశాల జట్లు ఎదురుపడితే మాత్రం అది ఓ మినీ యుద్ధం అనే భావిస్తారు రెండు దేశాల అభిమానులు.
కానీ ఇండియా క్రికెట్ ఫ్యాన్స్, పాకిస్థాన్ క్రికెట్ ఫ్యాన్స్ లో తేడాలు ఉన్నాయి అని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మెన్ రమీజ్ రాజా అన్నారు. ఆయన మన ఇండియా ఫ్యాన్స్ ను మెచ్చుకుంటూ.. పాక్ ఫ్యాన్స్ ను విమర్శించారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రమీజ్ రాజా.. పాకిస్థాన్ జట్టుకు ఫ్యాన్స్ యొక్క సపోర్ట్ కావాలని.. కానీ అది లభించడం లేదు అన్నారు.
ఆసియా కప్ లో మనం ఫైనల్స్ కు వెళ్ళాము.. అయిన కూడా మన ఫ్యాన్స్ జట్టును విమర్శించారు. కానీ ఇండియా సూపర్ 4 లోనే ఇంటికి వెళ్ళింది. వాళ్ళ బ్యాటర్ కోహ్లీ.. ప్రత్యర్థి నాలుగు క్యాచ్చులు వదిలేసిన తర్వాత.. సెంచరీ చేస్తే వారు అన్ని మర్చిపోయి.. సంబరాలు చేసుకున్నారు. కానీ ఇక్కడ బాబర్ ఆజాం సెంచరీ చేసిన అందులో తప్పులు వెతుకుతారు. అదే వారిలో మనలో ఉన్న తేడా. కాబట్టి ఇప్పటికైనా పాక్ జట్టుకు ఫ్యాన్స్ మద్దతుగా నిలవాలని రమీజ్ రాజా సూచించారు.

Advertisement

Visitors Are Also Reading