Home » ర‌వితేజ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్‌.. ”రామారావు ఆన్ డ్యూటీ” రిలీజ్ డేట్ ఫిక్స్‌

ర‌వితేజ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్‌.. ”రామారావు ఆన్ డ్యూటీ” రిలీజ్ డేట్ ఫిక్స్‌

by Bunty

మాస్ మహారాజ్ రవితేజకు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఆయన సినిమాలంటే మాస్ ఫ్యాన్స్ పడి చచ్చిపోతారు. అయితే క్రాక్ సినిమాతో… బంపర్ విజయాన్ని అందుకున్నారు మాస్ మహారాజ్. క్రాక్ సినిమా హిట్ కావడంతో వరుస సినిమాలు చేస్తున్నారు. రవితేజ నటించిన చలన చిత్రం ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకోగా.. ఈ మూవీను ఫిబ్రవరి 11వ తేదీన విడుదల కానుంది. ఇక ప్రస్తుతం శరత్ మండవ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా రామారావు ఆన్ డ్యూటీ.

ఈ సినిమాలో దివ్యాంకా కౌశిక్‌, ర‌జిషా విజ‌య‌న్ హీరోయిన్లు గా న‌టిస్తున్నారు. సుధాక‌ర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఓ ప్ర‌భుత్వం అధికారిగా ర‌వితేజ న‌టిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్ర‌స్తుతం జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలో ఈ మూవీ నుంచి బిగ్ అప్డేట్ వ‌చ్చింది. మార్చి 25 వ తేదీన ఈ సినిమా ను థియేట‌ర్ల‌లో విడుద‌ల చేయ‌నున్న‌ట్లు చిత్ర బృందం ప్ర‌క‌టించింది. ఈ అప్డేట్ తో ర‌వితేజ ఫ్యాన్స్ లో కోలాహలం మొద‌లైంది.

Visitors Are Also Reading