Home » ఆ ముగ్గురు హీరోల గురించి రామ్ చరణ్ ఆసక్తికర కామెంట్స్.. సోషల్ మీడియాలో వైరల్..!

ఆ ముగ్గురు హీరోల గురించి రామ్ చరణ్ ఆసక్తికర కామెంట్స్.. సోషల్ మీడియాలో వైరల్..!

by Anji
Ad

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్  రాజమౌళి తెరకెక్కించిన RRR  మూవీతో గ్లోబల్ స్టార్ గా ఎదిగారు అనడంలో  ఎలాంటి అతిశయోక్తి లేదు. ముఖ్యంగా రాజమౌలీ సినిమాలతోనే చరణ్ కి క్రేజీ అమాంతం పెరిగిపోతుంది. మగధీర మూవీతో ఎంతటి క్రేజ్ వచ్చిందో.. ఇప్పుడు RRRతో అంతకు రెట్టింపు క్రేజీ లభించింది.   ప్రస్తుతం వరుస సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు రామ్ చరణ్. కోలీవుడ్ అగ్ర దర్శకుడు శంకర్, టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు కాంబినేషన్ లో తెరకెక్కే మూవీలో నటిస్తున్నాడు రామ్ చరణ్. ఈ మూవీకి గేమ్ చేంజర్ అనే పేరు కూడా ఖరారు చేశారు.

Advertisement

ఇటీవలే రామ్ చరణ్-ఉపాసన దంపతులకు పండంటి ఆడబిడ్డ జన్మించిన విషయం విధితమే. భార్య డెలివరీ అవుతుందని దాదాపు రెండు నెలల ముందు నుంచే షూటింగ్ బంద్ చేసుకొని రామ్ చరణ్ భార్య వెంటే ఉన్నాడు. దీంతో ఈ షూటింగ్ కి కాస్త గ్యాప్ వచ్చింది. ఇలా షూటింగ్ కి కొద్ది రోజుల పాటు బ్రేక్ ఇచ్చినటువంటి చరణ్.. తిరిగి సినిమా షూటింగ్ లో బిజీ అయ్యారు. తాజాగా రాంచరణ్ కి సంబంధించినటువంటి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో భాగంగా రామ్ చరణ్ ను ప్రశ్నిస్తూ.. టాలీవుడ్ స్టార్ అటువంటి ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేష్ బాబు ఈ ముగ్గురిలో ఉన్నటువంటి ఏ క్వాలిటీ మీలో ఉంటే బాగుంటుందని యాంకర్ ప్రశ్నించగా.. రామ్ చరణ్ ఆసక్తికరంగా సమాధానం చెప్పాడు.

Advertisement

ముఖ్యంగా ఎన్టీఆర్ చాలా ఎనర్జిటిక్ మేన్ అని,  ఆయనలో ఉన్నటువంటి ఎనర్జీ నాకు అస్సలు లేదు. అందుకే తన ఎనర్జీ నాకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. అలాగే అల్లు అర్జున్ గురించి మాట్లాడుతూ.. బన్నీ చాలా స్పోర్టివ్ గా ఉంటారు. ఎవరైనా ఏదైనా అంటే దాని గురించి అస్సలు పట్టించుకోరు. దానిని సరదాగా తీసుకొని ముందుకెళ్తుంటారు బన్నీ.ఇక టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.  ఆయనలో ఉన్నటువంటి అందం కాస్త నాకు కూడా ఉంటే బావుంటుందని చెప్పుకొచ్చారు బన్నీ. ఈ ముగ్గురు స్టార్ హీరోలలో ఉన్నటువంటి క్వాలిటీస్ తనలో లేవని.. ఆ క్వాలిటీస్ ఉంటే బాగుండేది అంటూ ఈ సందర్భంగా చరణ్ మాట్లాడిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

రాజకీయాల్లోకి రాబోతున్న అభిషేక్ బచ్చన్..? ఆ స్థానం నుంచే పోటీ..?

 ప్రభాస్ అభిమానులకు జగపతి బాబు షాక్ ఇచ్చాడా..? అసలు ఏం జరిగిందంటే..?

Visitors Are Also Reading