Home » రాజకీయాల్లోకి రాబోతున్న అభిషేక్ బచ్చన్..? ఆ స్థానం నుంచే పోటీ..?

రాజకీయాల్లోకి రాబోతున్న అభిషేక్ బచ్చన్..? ఆ స్థానం నుంచే పోటీ..?

by Anji
Ad

బాలీవుడ్ స్టార్ హీరో అభిషేక్ బచ్చన్ త్వరలో రాజకీయాల్లోకి రాబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అది కూడా ఆయన తండ్రి బిగ్ బీ అమితాబ్ బచ్చన్ పోటీ చేసి గెలిచిన స్థానం నుంచి బరిలోకి దిగబోతున్నట్టు సమాచారం. సమాజ్ వాదీ పార్టీ తరపున ప్రయోగ్ రాజ్ లోక్ సభ పార్లమెంట్ స్థానం నుంచి అభిషేక్ పోటీ చేయనున్నట్టు తెలుస్తోంది. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ కోరిక మేరకు 1984లో అమితాబ్ ప్రయోగ్ రాజ్ స్థానం కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేసి భారీ మెజార్టీతో లోక్ దల్ నాయకుడు హేమ్ వతి బహుగుణపై భారీ మెజార్టీతో గెలుపొందారు.

Advertisement

మరోవైపు అభిషేక్ తల్లి జయాబచ్చన్ కూడా సమాజ్ వాది పార్టీ తరపున ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభ ఎంపీగా కొనసాగుతున్నారు. తాజాగా అభిషేక్ కూడా వారి తల్లిదండ్రుల అడుగు జాడల్లోనే నడవాలని అనుకుంటున్నాడు. అభిషేక్ బచ్చన్ త్వరలో అఖిలేష్ యాదవ్  కి సంబంధించిన సమాజ్ వాదీ పార్టీలో చేరబోతున్నట్టు సమాచారం. 2024లో జరిగే ఎన్నికల్లో ప్రయాగ్ రాజ్ నుంచి అభిషేక్ ని పోటీ చేయించాలని సమాజ్ వాదీ పార్టీ పెద్దలు భావిస్తున్నారు. దీనిపై అధికారికంగా ఎవ్వరూ స్పందించలేదు. కానీ సమాజ్ వాది పార్టీ మాత్రం దీనిపై స్పందించింది. అభిషేక్ బచ్చన్ రాజకీయాల్లోకి వస్తాడని  చాలా కాలం నుంచే ప్రచారం జరుగుతుంది.

Advertisement

ఇప్పటివరకు చాలా సినిమాల్లో రాణించిన అభిషేక్ ఇప్పుడు రాజకీయాల్లో కూడా సత్తా చూపాలని ఉవ్విళ్లూరుతున్నట్టు తెలుస్తోంది. ఇటీవలే అభిషేక్ బచ్చన్, యామీ గౌతమ్ జంటగా నటించిన దాస్వి సినిమా ఓటీటీలో విడుదలైంది. ఇందులో అభిషేక్ బచ్చన్ నటనకు ప్రశంసలు లభించాయి. ప్రస్తుతం అభిషేక్ బచ్చన్ చేతిలో బ్రీత్, ధూమ్ 4, హౌస్ పుల్ 5, దాస్విన్ సినిమాలు ఉన్నాయి. తన నటనతో చాలా మంది  హృదయాలను గెలుచుకున్న అభిషేక్.. పాలిటిక్స్ లో ఏ మేరకు రాణిస్తాడో వేచి చూడాలి మరీ. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

మహేష్ బాబు 1 నేనొక్కడినే మూవీలో అలా చేశాడా..? సుకుమార్ ఏం చెప్పాడంటే..?

ఎవరు చేయని త్యాగం చేసిన ఇంద్రజ భర్త..అది ఏంటో తెలుసా ?

Visitors Are Also Reading