Home » నరసింహనాయుడు లో మానస్ ఉన్నాడని మీకు తెలుసా… ఈ బుడ్డోడేనట…!

నరసింహనాయుడు లో మానస్ ఉన్నాడని మీకు తెలుసా… ఈ బుడ్డోడేనట…!

by Bunty
Published: Last Updated on
Ad

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బి. గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన నరసింహనాయుడు సినిమా 2001లో విడుదలైంది. జనవరి 12న సంక్రాంతి కానుకగా ఈ సినిమా బాక్సాఫీస్ బరిలో దిగింది. ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలు ఉన్నప్పటికీ ఈ సినిమా బాలయ్య కెరీర్ లోనే ప్రత్యేకమని చెప్పాలి. ఈ చిత్రానికి ప్రముఖ రచయిత చిన్ని కృష్ణ కథను అందించగా, పరుచూరి బ్రదర్స్ మాటలు రాశారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

READ ALSO : వడదెబ్బ తగిలితే… కోమాలోకి వెళ్ళిపోతామా?

Advertisement

ఇది ఇలా ఉండగా, ఇటీవల బిగ్ బాస్ ఫేమ్ మానస్, విష్ణు ప్రియ ఇద్దరు కలిసి రెండు ఫోక్ సాంగ్స్ చేశారు. అవి ఇప్పుడు ఫుల్ ట్రెండ్ అవుతున్నాయి. అందుకే ఇప్పుడు వాళ్ళు మై విలేజ్ షో అనిల్ తో కలిసి బొందలో చికెన్ వండుకొని తిని హ్యాపీ మూమెంట్స్ ని సెలబ్రేట్ చేసుకున్నారు. అందులో భాగంగా అనిల్ మానస్ గురించి ఎన్నో విషయాలు అడిగాడు. వాటికి మానస్ చాలా బాగా సమాధానం ఇచ్చారు. సోషల్ మీడియాలో చాలా రోజుల నుంచి కలుద్దాం కలుద్దాం అనుకుంటూ ఇప్పటికి కుదిరింది.

Advertisement

READ ALSO : రెచ్చిపోయిన ‘RX 100’ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్… ఏకంగా అలా..!

అసలు మీ ప్రయాణం ఇటువైపు ఎలా, అని అనిల్ అడిగేసరికి నేను చైల్డ్ ఆర్టిస్ట్ అని.. బాలకృష్ణ గారి మూవీ నరసింహనాయుడులో నటించానని వెల్లడించారు. హీరో అనే చిల్డ్రన్ ఫిలింలో నటించినందుకు నాకు నంది అవార్డు కూడా వచ్చింది. ఆ తర్వాత నా ఎడ్యుకేషన్ పూర్తిచేసుకుని ఇటు వచ్చేసాను. నేను బీటెక్ ఈసీఈ కంప్లీట్ చేశాను. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి వచ్చిన దగ్గరనుంచి నేను అందరికీ ఇంకా ఎక్కువగా తెలుసానని అన్నాడు.

READ ALSO : కోట్ల ఆస్తులు ఉన్నా.. అమెరికాలో ఆ జాబ్ చేస్తున్న హీరోయిన్ లయ…!

Visitors Are Also Reading