Home » అఖిల్ పై రామ్ చరణ్ స్పెషల్ ఫోకస్.. ఫాప్స్ నుంచి గట్టేక్కించేందుకేనా ?

అఖిల్ పై రామ్ చరణ్ స్పెషల్ ఫోకస్.. ఫాప్స్ నుంచి గట్టేక్కించేందుకేనా ?

by Anji
Ad

టాలీవుడ్ దర్శకుడు  సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ఏజెంట్ మూవీ హీరో అఖిల్ అక్కినేనికి తీవ్ర నిరాశనే మిగిల్చింది. ఈ సినిమా కోసం రెండేళ్లకు పైగా పడిన  కష్టమంతా వృధా అయింది. దీంతో రీఫ్రెష్ అయ్యేందుకు కాస్త టైమ్ తీసుకున్న అఖిల్.. రెట్టించిన ఉత్సాహంతో కమ్ బ్యాక్ ఇవ్వాలనుకుంటున్నాడు. ఈ మేరకు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం సిద్ధమవుతున్నాడు. అయితే ఇదే క్రమంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.. అఖిల్ తో సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇదేదో మల్టీ స్టారర్ మూవీ అనుకోకండి. ఈ సినిమాకు రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరించనున్నాడు.

Advertisement

 రామ్ చరణ్ తన ఫ్రెండ్ విక్రమ్ తో కలిసి కొత్తగా ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేశాడు. వి మెగా పిక్చర్స్ అని పేరు కూడా అనౌన్స్ చేశాడు. ఈ బ్యానర్ పై విక్రమ్, చరణ్ కలిసి యంగ్ అండ్ న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేయడంతో పాటు పాన్ ఇండియా మూవీస్ నిర్మించాలని డిసైడ్ అయ్యారు. అంతేకాదు.. ఫిలిం డిస్ట్రిబ్యూషన్ వంటి ఇతర వెంచర్లలోను భాగస్వామ్యం కావాలని వారు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తమ మొదటి ప్రాజెక్టుగా అఖిల్ తో సినిమా చేయనున్నట్టు సమాచారం. వీళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ అని తెలిసిందే. ఈ కాంబినేషన్ గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే రామ్ చరణ్ తన కొత్త వెంచర్ గురించి తాజాగా మాట్లాడారు. వి మెగా పిక్చర్స్ లో తాము వైవిధ్యంతో కూడిన ఫ్రెష్ కంటెంట్ ను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించినట్లు చెప్పారు.

Advertisement

Manam News

క్రియేటివిటీని సాధిస్తూ, బౌండరీస్ అధిగమించడం ద్వారా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీపై శాశ్వత ప్రభావాన్ని సృష్టించాలని, ఈ మేరకు న్యూ అండ్ ఎమర్జింగ్ టాలెంట్ కు మార్గం సుగమం చేయడమే తమ లక్ష్యమని ప్రకటించారు. ఇక రామ్ చరణ్ ఇప్పటికే కొణిదెల ప్రొడక్షన్స్ పేరుతో ఒక నిర్మాణ సంస్థను కలిగి ఉన్న సంగతి తెలిసిందే. ఇదే బ్యానర్ పై మెగాస్టార్ చిరంజీవి హీరోగా, సైరా నరసింహారెడ్డి, ఆచార్య, గాడ్ ఫాదర్ వంటి సినిమాలను నిర్మించారు. ఇప్పుడు తన ఫ్రెండ్ తో కలిసి కొత్త బ్యానర్ స్థాపించిన చరణ్.. కొత్త ఐడియాలతో ముందుకెళ్లాలని భావిస్తున్నారు. ఈ బ్యానర్ లో అఖిల్ తో నిర్మించే సినిమా సక్సెస్ సాధిస్తుందో లేదో వేచి చూడాలి మరి. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

మా సభ్యత్వం రద్దుపై స్పందించిన క‌రాటే క‌ళ్యాణి.. ‘నేను ఏం తప్పు చేశాను’

 పవన్ కళ్యాణ్ OG సినిమాలో విలన్ గా ఆ స్టార్ హీరోనేనా ?

Visitors Are Also Reading