Home » మా సభ్యత్వం రద్దుపై స్పందించిన క‌రాటే క‌ళ్యాణి.. ‘నేను ఏం తప్పు చేశాను’

మా సభ్యత్వం రద్దుపై స్పందించిన క‌రాటే క‌ళ్యాణి.. ‘నేను ఏం తప్పు చేశాను’

by Anji
Ad

సాధారణంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు మరో విషయం హాట్ టాపిక్ గా చక్కర్లు కొడుతోంది. అది ఏంటంటే.. కరాటే కళ్యాణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. నటిగా ఆమె ఎన్నో సినిమాలలో నటించినా సమాజంలో జరిగే విషయాలపై స్పందిస్తూ.. వార్తల్లో నిలుస్తున్నారు. ఇదిలా ఉంటే.. మా అసోసియేషన్ నుంచి ఆమెను సస్పెండ్ చేస్తూ ఓ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా కరాటే కళ్యాణిని మా సభ్యత్వం నుంచి తొలగిస్తున్నట్టు నోటీసులు జారీ చేసింది.

Advertisement

సీనియర్ ఎన్టీఆర్ పై చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని మా అసోసియేషన్ మే 16న షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసులపై ఇప్పటివరకు కళ్యాణి స్పందించకపోవడంతో మా అసోసియేషన్ నుంచి కరాటే కళ్యాణిని సస్పెండ్ చేసినట్టు మా సభ్యులు తెలిపారు. తాజాగా కరాటే కళ్యాణి దీనిపై స్పందించారు. “ నేను చేసిన తప్పు ఏమిటో నాకు అర్థం కావడం లేదు. నేను మహానటుడు ఎన్టీఆర్ కి వ్యతిరేకం కాదు. కృష్ణుడి రూపంలో ఆయన విగ్రహం పెడితే సమాజంలోకి తప్పుగా వెళ్తుంది. ప్రతి హీరోకి దేవుడి రూపంలో విగ్రహం పెడితే దేవుళ్ల విగ్రహాలు ఎందుకు ? మాకు ఆయన ఎంతో ఇష్టమైన దైవం.

Advertisement

అక్కడ ఏవైనా అసాంఘిక కార్యకలాపాాలు జరిగితే.. దేవుడికి అప్రతిష్టనే కదా.. విగ్రహ ఏర్పాటును ఆపేయండి అని అడిగాను. మీరు అసోసియేషన్ నుంచి ఇలా మాట్లాడకూడదు అని నాకు షోకాజ్ నోటీసు పంపారు’ అని కరాటే కళ్యాణి చెప్పుకొచ్చారు. అయితే వివరణ ఇవ్వడానికి మూడు రోజులు గడువు ఇచ్చారు. కానీ నా ఆరోగ్యం బాగాలేదు. గొంతు కూడా పోయింది. అందుకే నేను వివరణ ఇవ్వలేదు అని తెలిపారు. తనకు ఇంకా టైమ్ కావాలని ఒక నోటీసు రాసి పంపించా.. దానిని లీగల్ నోటీసుగా భావించి తనను సస్పెండ్ చేశారని కరాటే కళ్యాణి చెప్పుకొచ్చారు. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

 MS నారాయణ రాసిన కథలను లేపేసిన ఆ స్టార్ దర్శకుడు ఎవరో తెలుసా ?

Malli Pelli Review in Telugu : మళ్ళీ పెళ్లి రివ్యూ.. ఎలా ఉందంటే ?

Visitors Are Also Reading