Home » ఆలీకి సీఎం జగన్ బంపరాఫర్…త్వరలో రాజ్యసభ టికెట్…!

ఆలీకి సీఎం జగన్ బంపరాఫర్…త్వరలో రాజ్యసభ టికెట్…!

by AJAY
Ad

టాలీవుడ్ ప్రముఖ కమిడియన్ అలీకి సీఎం జగన్ గుడ్ న్యూస్ చెప్పినట్టు తెలుస్తోంది. అలీకి రాజ్యసభ సీటు ఇచ్చే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. నేడు చిరంజీవితో పాటు పలువురు ఇండస్ట్రీ పెద్దలు సీఎం జగన్ ను కలిసిన సంగతి తెలిసిందే. వారిలో అలీ కూడా ఉన్నారు. కాగా అలీతో సీఎం జగన్ మంగళవారం మరోసారి కలుద్దామని చెప్పినట్టు సమాచారం. అయితే మంగళవారం అలీ కలిసేది సినిమాల విషయం కాదని ఆలికి రాజ్యసభ సీటు ఇచ్చేందుకు అనే వార్తలు వినిపిస్తున్నాయి.

Ali cm jagan

Advertisement

త్వరలో ఏపీలో నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. ఆ నాలుగు స్థానాలలో ఒక స్థానం మైనారిటీ కి కేటాయించబడుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఆ మైనార్టీ స్థానం అలీకి ఇచ్చే ఆలోచనలో సీఎం జగన్ ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే గత కొన్ని ఏళ్లుగా ఆలి వైసిపిలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఆయన గుంటూరు నుండి అసెంబ్లీ టికెట్ ను కూడా ఆశించారు.

Advertisement

కానీ ఏం జరిగిందో మళ్లీ ఆలీ వెనక్కు తగ్గారు. ఎన్నికల సమయంలో చాలా యాక్టివ్ గా ఉన్నారు. దాంతో అతడికి రాజ్యసభ సీటు కన్ఫర్మ్ అయినట్టే కనిపిస్తోంది. మరోవైపు ఆలికి రాజ్యసభ టికెట్ ఇవ్వడం ద్వారా సినీ ఇండస్ట్రీ కూడా వైసీపీ సర్కార్ కాస్త దగ్గరయ్యే అవకాశం ఉంది.

ఇదిలా ఉంటే నేడు సినీ పెద్దల తో సమావేశం అనంతరం ముఖ్యమంత్రి జగన్ చిత్ర పరిశ్రమపై కూడా వరాలు కురిపించారు. చిన్న సినిమాలు ఐదు షోలు వేసుకునేందుకు అనుమతి ఇచ్చారు. అంతే కాకుండా తెలంగాణలో మాదిరిగా ఏపీలోనూ సినిమా ఇండస్ట్రీ అభివృద్ధికి సహకరిస్తామని హామీ ఇచ్చారు.

Visitors Are Also Reading