Home » చిరంజీవితో పోలిక గురించి రాజ్ కుమార్ ఏమన్నారో తెలుసా ?

చిరంజీవితో పోలిక గురించి రాజ్ కుమార్ ఏమన్నారో తెలుసా ?

by Anji
Ad

సినీ ఇండస్ట్రీలో రాజ్ కుమార్ గురించి తెలియని వారుండరు. దాదాపు 30 సంవత్సరాలుగా వెండితెరపై తనదైన నటనతో మెప్పించారు. ఇప్పటికీ సినీ ఇండస్ట్రీలోనే కొనసాగుతున్నారు ఆయన. టాలీవుడ్ లో జూనియర్ చిరంజీవిగా గుర్తు పొందిన రాజ్ కుమార్ చాలా సినిమాల్లో, సీరియల్స్ లో నటించారు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న ఆయన సీరియల్స్ లో నటిస్తున్నారు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

Also Read : ఇదేంటండి సమంత గారు.. ఇక్కడ ఇలా అక్కడ ఆలా ఉంటారా ? అంటే మీరు చెప్పేవి అబద్ధాలా ?

Advertisement

ఈ సందర్భంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ.. “చిరంజీవి మాదిరిగా పోలీకలు ఉండటం నా అ దృష్టమని, కానీ అలా ఉండటం వల్లనే నేను హీరోగా సక్సెస్ సాధించలేక ఇక్కడే మిగిలిపోయాను. నేను చిరంజీవి పోలికలతో ఉండటం వల్ల చూసే వారికి గొప్పగా ఉంటుంది. కానీ ఇండస్ట్రీలో మాత్రం  అది నాకు చాలా మైనస్ పాయింట్. మెగాస్టార్ పోలికలతో ఉన్నందుకు గర్వపడుతాను. చిరంజీవిలా ఉంటానే కానీ.. ఆయనకు ఎక్కడ కూడా సరిపోను. ఆయన ఒక దిగ్గజం. నన్ను ఆయనతో పోల్చే సరికి మర్రిచెట్టు కింద కలుపు మొక్కలా అయిపోయాను.  

Advertisement

Also Read :  ఆ విషయంలో తన కొడుకుకు రాజమౌళి అన్యాయం చేశాడుగా…!

Manam News

తెలుగులో జూనియర్ చిరంజీవిగా ఇండస్ట్రీలో గుర్తింపు రావడంతో కన్నడ ఇండస్ట్రీకి వెళ్లిపోయాను. శ్రీకాంత్, నేను, విక్రమ్, అజిత్, ఆనంద్ ఒకేసారి ఇండస్ట్రీకి వచ్చాం. చిరంజీవి నన్ను తొక్కేశారన్నారు. ఒకవేళ అలా జరిగి ఉంటే నేను సీరియల్స్ లో కూడా కనిపించేవాడిని కాదు” చాలా ఎమోషనల్ అయ్యాడు రాజ్ కుమార్. ప్రస్తుతం రాజ్ కుమార్ సీరియల్స్ నటిస్తూ బిజీగా గడుపుతున్నారు. చిరంజీవి చేతుల మీదుగా అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం రాజ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. రాజ్ కుమార్ ప్రస్తుతం జనని, కేరాఫ్ అనసూయ వంటి సీరియల్స్ లో నటిస్తున్నారు.

Also Read :  Malli Pelli : ‘మళ్లీ పెళ్లి’ టీజర్ రిలీజ్….రమ్య రఘుపతిని టార్గెట్ చేశాడుగా!

Visitors Are Also Reading