Home » మయాంక్​తో పోటీపడుతున్న రాజస్థాన్ పేసర్..!

మయాంక్​తో పోటీపడుతున్న రాజస్థాన్ పేసర్..!

by Sravya
Ad

ఐపీఎల్ చాలా సంచలనాలకి వేదిక. ఎన్నో పాత రికార్డులు ప్రస్తుత సీజన్లో బ్రేక్ అవుతున్నాయి. కొంతమంది ఆటగాళ్లు అదిరిపోయే ఆట తీరుతో అందరి మనసుల్ని కూడా గెలుచుకుంటున్నారు. టీమిండితో పాటుగా ఫారెన్ స్టార్స్ రాణిస్తారు అని అనుకుంటే వాళ్ళతో పోటీపడుతూ యువకులు మంచి ఇంప్రెషన్ ని తీసుకుంటున్నారు లక్నో సూపర్ జయింట్ పేస్ మయాంక్ యాదవ్ వాళ్ళలో ఒకరు. 150 కిలోమీటర్ల కి తగ్గని ఎక్స్ప్రెస్ పేస్ తో అతను వేసే బంతులకి మహా మహా బాటర్లు కూడా ఆన్సర్ చెప్పలేకపోతున్నారు. మయాంక్ వరుసగా అద్భుతమైన ప్రదర్శనలతో అందరి దృష్టిలో పడ్డాడు.

Advertisement

యంగ్ పేసర్ అతడికి పోటీగా దూసుకు వచ్చాడు. అతను ఎవరో కాదు కుల్దీప్ సేన్. రాజస్థాన్ రాయల్స్ పెసర్ కుల్దీప్ సేన్ గురించి క్రికెట్ అభిమానులు మాట్లాడుకుంటున్నారు. గుజరాత్ టైటాన్స్ తో మ్యాచ్ లో అతను బౌలింగ్ చేసిన విధానానికి అందరూ కూడా ఫిదా అయిపోయారు. ఓటీ ఓపెనర్స్ వేడ్ సాయి సుదర్శన్ తో పాటు అభినవ్ మనోహర్ని అవుట్ చేశాడు. వీళ్ళలో సుదర్శన్ ఎల్బిడబ్ల్యుగా మిగిలిన ఇద్దరు క్లీన్ బౌల్డ్ అయ్యారు.

Advertisement

Also read:

Also read:

147 కిలోమీటర్ల వేగంతో బంతులు విసురుతూ బ్యాటర్లకి తిప్పలు పెట్టాడు. నాలుగు ఓవర్లలో 41 పరుగులు ఇచ్చి మూడు కీలక వికెట్లని పడగొట్టాడు. కుల్దీప్ సీన్ ఎవరు..? కుల్దీప్ సీన్ మధ్యప్రదేశ్ కి చెందిన ఆటగాడు. అక్టోబర్ 22 1996న రేవాలో పుట్టారు. ఎంపీ తరపున డొమెస్టిక్ లెవెల్ లో రాణిస్తూ ఈ స్థాయికి చేరుకున్నాడు. 20 లక్షల బేస్ ప్రైజ్ కి అతనిని రాజస్థాన్ రాయల్స్ సొంతం చేసుకుంది మొత్తంగా టీ20 లో 37 మ్యాచుల్లో 29 వికెట్లని పడగొట్టాడు.

స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

Visitors Are Also Reading