Home » Murali Mohan: రెండు సార్లు పేర్లు మార్చుకున్న మురళీ మోహన్.. అసలు పేరు ఏమిటంటే..?

Murali Mohan: రెండు సార్లు పేర్లు మార్చుకున్న మురళీ మోహన్.. అసలు పేరు ఏమిటంటే..?

by Sravya
Ad

Murali Mohan: టాలీవుడ్ సీనియర్ నటుడు మురళీమోహన్ గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. మురళీమోహన్ అందరికీ సుపరిచితమే. మురళీమోహన్ తన పేరుని రెండుసార్లు మార్చుకున్నారు. ఈ విషయం చాలామందికి తెలియదు. అసలు మురళీమోహన్ ఎందుకు రెండు సార్లు పేర్లు మార్చుకున్నారు..?

murali-mohan

Advertisement

ఆ పేర్లు ఏంటి అనే విషయాన్ని ఇప్పుడు చూసేద్దాం అప్పుడప్పుడు ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వాలని సెలబ్రిటీలో పేర్లు మార్చుకుంటూ ఉంటారు చిరంజీవి రజినీకాంత్ వంటి వాళ్ళు కూడా స్క్రీన్ నేమ్ ని మార్చుకున్న విషయం మనకి తెలుసు. అసలు పేరు వదిలేసి స్క్రీన్ మీద కనపడే పేరుని పెద్ద పెద్ద హీరోలు మార్చుకున్నారు.

సీనియర్ నటుడు మాగంటి మురళీమోహన్ తెలుగు సినిమాల్లో హీరోగా నటించి మెప్పించారు. అప్పట్లో ఎంతో మంది ప్రేక్షకుల హృదయాలని గెలుచుకున్నారు. మురళీమోహన్ కేవలం నటుడిగానే కాకుండా నిర్మాతగా రాజకీయ నాయకుడిగా కూడా రాణించారు వ్యాపారవేత్తగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఎంతో గొప్ప కీర్తిని పొందారు. 350 కి పైగా సినిమాల్లో నటించారు. మురళీమోహన్ తన పేరుని రెండుసార్లు మార్చుకున్న విషయాన్ని మురళీమోహన్ చెప్పారు.

Advertisement

Also read:

మొదట నా తండ్రి రాజా రామ్మోహన్ రాయ్ అని పేరు పెట్టారు. ఆయనకి స్వతంత్ర సమరయోధులు ఇష్టం. అందుకని నా పేరు ఇలా పెట్టారు అని అన్నారు. తర్వాత స్కూల్లో ఇబ్బందిగా ఉందని రాజబాబు గా మార్చారట. సినిమాల్లోకి వచ్చిన తర్వాత రాజబాబు గా కాకుండా మురళీమోహన్ గా పేరు మార్చుకున్నారు. మురళీమోహన్ ఇలా మురళీమోహన్ గా అందరికీ పరిచయమయ్యారు. ఆ పేరుతోనే కంటిన్యూ చేస్తున్నారు మురళీమోహన్ అనే గొప్ప నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు ఎంతోమంది హృదయాన్ని గెలుచుకున్నారు మురళీమోహన్.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading