Home » Love Guru Review & Rating: విజయ్ ఆంటోని ”లవ్ గురు” సినిమాతో హిట్ కొట్టేసారా..?

Love Guru Review & Rating: విజయ్ ఆంటోని ”లవ్ గురు” సినిమాతో హిట్ కొట్టేసారా..?

by Sravya
Ad

Love Guru Review & Rating:  విజయ్ ఆంటోని, మృణాళిని రవి, యోగిబాబు, శ్రీజ రవి తదితరులు ఈ సినిమా లో నటించారు. వినాయక్ వైద్యనాధన్ ఈ సినిమా కి దర్శకత్వం వహించారు. మీరా విజయ్ ఆంటోని, విజయ్ ఆంటోని, సంద్ర జాన్సన్, నవీన్ కుమార్ సినిమా ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. భరత్ ధన శేఖర్ సంగీతాన్ని అందించారు.

సినిమా: లవ్ గురు
నటీనటులు: విజయ్ ఆంటోని, మృణాళిని రవి, యోగిబాబు, శ్రీజ రవి తదితరులు.
దర్శకత్వం: వినాయక్ వైద్యనాధన్
నిర్మాత: మీరా విజయ్ ఆంటోని, విజయ్ ఆంటోని, సంద్ర జాన్సన్, నవీన్ కుమార్
సంగీతం: భరత్ ధన శేఖర్
రిలీజ్ డేట్: 11-04-2024

Advertisement

కథ మరియు వివరణ:

ఇక లవ్ గురు స్టోరీ విషయానికి వచ్చేస్తే,, అరవింద్ (విజయ్ అంటోనీ) మలేషియాలో కేఫ్ నడుపుతూ ఉంటాడు. అతన్ని తన చెల్లి తాలూకు ఒక చేదుగతం వెంటాడుతూ ఉంటుంది ఇంకో పక్క ఆర్థిక సమస్యల నుండి ఇంటిని గట్టెక్కించే క్రమంలో వృత్తిలో ఒత్తిడి పడతాడు వ్యక్తిగత జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తాడు. 35 ఏళ్ల వచ్చినా కూడా ప్రేమా పెళ్ళికి నోచుకోలేక పోతాడు. సింగిల్ గానే ఉంటూ ఉంటాడు. సింగిల్ జీవితానికి ముగింపు చెప్పాలని మలేషియా నుండి ఇండియాకి తిరిగి వస్తాడు. అరవింద్ అనుకోకుండా ఒక చావు ఇంట్లో తన బంధువుల అమ్మాయి లీలా (మృణాళిని) ని చూసి మనసు పరేసుకుంటాడు. అది గ్రహించిన అతని తల్లిదండ్రులు వెంటనే లీలా తండ్రి తో పెళ్లి సంబంధం మాట్లాడుతారు.

కానీ లీలాకి పెళ్లి అస్సలు ఇష్టం లేదు ఎందుకంటే సినిమా హీరోయిన్ అవ్వాలని ఆమె జీవిత లక్ష్యం. ఆమె నటిగా మారడాన్ని అంగీకరించడం వివాహం జరిపిస్తాడు అయితే పెళ్లయిన మరుసటి రోజు లీలాకి తనకి ఇష్టం లేని పెళ్లి చేశారన్న విషయం అరవింద్ కి తెలుస్తుంది. ఈ క్రమంలో ఆమె అతని ని దూరం పెట్టే ప్రయత్నం చేస్తుంది తరువాత ఏమైంది..? అరవింద్ తన భార్య మనసుని గెలుచుకోవడానికి ఏం చేస్తాడు..? అతన్ని వెంటాడుతున్న చెల్లి తాలూకా చేదు గతం ఏంటి..? హీరోయిన్ అవ్వాలన్న లీలా లక్ష్యం నెరవేరుతుందా..? ఏమవుతుంది అనేది తెలియాలంటే సినిమా చూడాలి.

Advertisement

Also read:

Also read:

లవ్ గురు సినిమాని దర్శకుడు తీర్చిదిద్దన తీరు బాగుంటుంది. స్టోరీ కి చెల్లి సెంటిమెంట్ ని జోడించి కొంచెం ఎమోషనల్ గా తెరమీదకి తీసుకొచ్చారు. పెళ్లి అనేది స్త్రీ కలలకి అడ్డంకి కాదు అనే సందేశాన్ని తెలియజేసే ప్రయత్నాన్ని చేశారు దర్శకుడు ఒక రొటీన్ డ్రామా తో సినిమాని స్టార్ట్ చేశారు. అరవింద్ లీల కి మధ్య వచ్చే సీన్స్ ఎమోషనల్ గా ఆకట్టుకుంటాయి. విజయ్ అంటోని ఈ సినిమాతో కొత్త ప్రయత్నాన్ని చేశారు. కామెడీ ఎమోషనల్ సీన్స్ లో చక్కటి నటన కనబరిచారు. ఎండింగ్ లో నటన ఎమోషనల్ గా ఉంటుంది. లీలాగా హీరోయిన్ తెరమీద చాలా అందంగా కనపడింది. విజయ్ మామయ్యగా నటించిన వీటీవీ గణేష్ కనిపించినంత సేపు నవ్వించే ప్రయత్నం చేశారు. మిగిలిన నటులు అందరూ కూడా పాత్రకి తగ్గట్టుగా బానే నటించారు కథనం అంతా ఊహలకి తగ్గట్టుగానే ఉంటుంది. ఎక్కడ కూడా బోర్ కొట్టదు.

ప్లస్ పాయింట్స్

విజయ్ ఆంటోనీ, మృణాళిని నటన
పతాక సన్నివేశాలు
వినోదాత్మకంగా కథని తీర్చిన పద్ధతి

మైనస్ పాయింట్స్

ఊహలకి తగ్గట్టుగా ఉన్న సీన్స్
పాటలు

రేటింగ్: 2.5/5

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading